Sunday, January 19, 2025
Homeసినిమారేపు హాట్ స్టార్ లో జేడీ చక్రవర్తి 'దయా'

రేపు హాట్ స్టార్ లో జేడీ చక్రవర్తి ‘దయా’

సినిమాల్లో అవకాశాలు తగ్గినవారే ఓటీటీ ప్రాజెక్టుల వైపు వెళతారనే ఒక అభిప్రాయం కొంతకాలం క్రితం వరకూ ఉండేది. కానీ రాన్రాను ఆ అభిప్రాయం మారుతూ వచ్చింది. ఇప్పుడు ఓటీటీ ప్రాజెక్టులు చేయడానికి స్టార్ హీరోలు సైతం రెడీ అవుతున్నారు. టాలీవుడ్ నుంచి చూసుకుంటే వెంకటేశ్ వంటి సీనియర్ స్టార్ హీరోలు .. రానా .. నవదీప్ వంటివారు రంగంలోకి దిగిపోయారు. ఇక హీరోయిన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. దీనంతటికీ కారణం ఓటీటీ కంటెంట్ కి పెరుగుతున్న ఆదరణ .. ఆ వైపు నుంచి వస్తున్న రెస్పాన్స్.

ఒకప్పుడు వెబ్ సిరీస్ లు .. ముఖ్యంగా తెలుగు వెబ్ సిరీస్ లు కాస్త ఖర్చు తక్కువలో లాగించేవారు. అందువలన కొంతమంది స్టార్స్ ఆలోచన చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు తెలుగు వెబ్ సిరీస్ లు కూడా ఇతర భాషల్లోని వెబ్ సిరీస్ ల క్వాలిటీకి ఏ మాత్రం తగ్గకుండా దూసుకెళుతున్నాయి. అందువలన ఈ వైపు చాలా మంది హీరోలు మొగ్గుచూపుతున్నారు. అందువల్లనే జేడీ చక్రవర్తి కూడా ఈ దిశగా అడుగులు వేశాడు .. తన కెరియర్లో ఫస్టు టైమ్ ఒక తెలుగు వెబ్ సిరీస్ చేశాడు .. ఆ వెబ్ సిరీస్ పేరే ‘దయా’.

జేడీ చక్రవర్తి ప్రధానమైన పాత్రగా నడిచే ఈ వెబ్ సిరీస్ కి పవన్ సాధినేని దర్శకత్వం వహించాడు. హీరో ఒక వ్యాన్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు .. అందమైన భార్యతో ఆయన జీవితం ఆనందంగా సాగిపోతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో అతను ఒక మర్డర్ కేసులో చిక్కుకుంటాడు. అప్పుడు అతను ఏం చేస్తాడు? అనే ఆసక్తికరమైన అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తనకి ఎదురైన ఒక ప్రమాదకరమైన సమస్య నుంచి ఒక సామాన్యుడు ఎలా బయటపడ్డాడనేది ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ఈ నెల 4వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ లో స్ట్రీమింగ్ అవుతుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్