Wednesday, May 8, 2024
Homeసినిమాకడుపుబ్బ నవ్వించే ‘పీప్ షో’

కడుపుబ్బ నవ్వించే ‘పీప్ షో’

సుప్రీమ్ డ్రీమ్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి క్రాంతికుమార్ సి.హెచ్ దర్శకత్వంలో యువనిర్మాత ఎస్.ఆర్.కుమార్ నిర్మిస్తున్న వినూత్న కథాచిత్రం ‘పీప్ షో’. దొంగచాటుగా తొంగిచూడడాన్ని ‘పీప్ షో’ అంటారన్న విషయం తెలిసిందే. జబర్దస్త్ ఫేమ్ ఆటో రాంప్రసాద్ మొదటిసారి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నేహా దేశ్ పాండే హీరోయిన్. ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ సంస్థ కార్యాలయంలో విడుదల చేశారు. జబర్దస్త్ సెలబ్రిటీస్ హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

“స్వతహాగా రైటర్ అయిన ఆటో రాంప్రసాద్ హీరోగా లాంచ్ అవుతున్న ‘పీప్ షో’ కాన్సెప్ట్ తమకు తెలుసని, ఈ కాన్సెప్ట్ తో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారని, అందరికీ విపరీతంగా నచ్చుతుందని అతిధులుగా హాజరైన హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను అన్నారు. హీరోగా రాంప్రసాద్, దర్శకుడిగా క్రాంతి కుమార్, నిర్మాతలుగా ఎస్.ఆర్.కుమార్-సురేష్ కాకుమానిలకు మంచి పేరు తెస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

బుల్లి తెరపై కామెడీ సునామి సృష్టిస్తున్న సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను “పీప్ షో” ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం పట్ల హీరో ఆటో రాంప్రసాద్, దర్శకుడు క్రాంతి కుమార్, నిర్మాత సురేష్ కాకుమాని, హీరోయిన్ నేహాదేశ్ పాండే సంతోషం వ్యక్తం చేశారు. ఈ సినిమా తమ బ్యానర్ ‘సుప్రీమ్ డ్రీమ్స్’ కు మంచి శుభారంభం ఇస్తుందని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్