Friday, April 19, 2024
Homeసినిమాత్వరలో పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ సినిమా షూటింగ్ మొదలు

త్వరలో పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ సినిమా షూటింగ్ మొదలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ ల కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం విదితమే. ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలు శరవేగంగా పూర్తి కానున్నాయి.’భీమ్లా నాయక్’ చిత్రం త్వరలో పూర్తి కానుంది. ‘హరి హర వీరమల్లు’ చిత్రం షూటింగ్ తిరిగి ప్రారంభమైన తర్వాతా ఈ సినిమా షూటింగ్  మొదలు కానుంది. మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ లు తెలిపారు.

పవన్ కళ్యాణ్ పుట్టినరోజున విడుదల అయిన ఈ చిత్రం ప్రచార చిత్రం అభిమానుల అంచనాలను, ఉత్సుకతను మరింత పెంచిన నేపథ్యంలో,చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతోందన్న తాజా సమాచారం మరింత ఆనందాన్ని కలిగిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి అయాంక బోస్ ఛాయాగ్రహణ దర్శకత్వం వహిస్తున్నారు. కళా దర్శకుడు గా ఆనంద సాయి, ఎడిటర్ గా చోటా కె ప్రసాద్, పోరాటాలు రామ్ లక్ష్మణ్ ఇప్పటి వరకు ఎంపిక అయిన ప్రధాన సాంకేతిక నిపుణులు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్