Irrigation Project: పోలవరం ప్రాజెక్టును బ్యారేజిగా మార్చే హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారంటూ మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రశ్నించారు. ఈ బహుళార్ధసాధక ప్రాజెక్ట్‌ను ఎత్తిపోతల పధకంగా మార్చడంపై ఆయన మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా ఉమా ఈ వ్యాఖ్యలు చేశారు.
“పోలవరాన్ని ఎత్తిపోతలగా మార్చడం రాష్ట్రరైతాంగ ప్రయోజనాలను తాకట్టుపెట్టడమే. కమిషన్ల కక్కుర్తితో రివర్స్ టెండరింగ్ డ్రామాతో పనులు ఆపారు .ఏడాదిగా ఒక్కశాతం పనులు చేయలేదు. 31మంది ఎంపీలుండి ఒక్కసారైనా నిధులడిగారా? కేసులకోసం పోలవరాన్నితాకట్టుపెట్టిన వైఎస్ జగన్ పోలవరం ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారు” అంటూ పోస్ట్ చేశారు.