Be Active: పార్టీ సమన్వయ కర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులు క్రియాశీలకంగా పనిచేయాలని, వారికి అప్పగించిన బాధ్యతలు పూర్తిస్థాయిలో నిర్వర్తించాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. తాదేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో జగన్ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షుల మీద అదనంగా బాధ్యతలు ఉన్నాయని, వారి నియోజకవర్గాలే కాకుండా, వారికి అప్పగించిన బాధ్యతలను కూడా చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. పార్టీపరంగా కార్యక్రమాలను పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత కూడా వీరిపైనే ఉందన్నారు.
నేతలకు జగన్ చేసిన సూచనలు:
- మీ అందరిమీద నమ్మకంతో పార్టీ సమన్వయకర్తలుగా, జిల్లా అధ్యక్షులుగా బాధ్యత అప్పగించాను
- అందరూకూడా చిత్తశుద్ధితో, అంకిత భావంతో పనిచేయాలి
- పార్టీ సమన్వయ కర్తలూ తమకు కేటాయించిన ప్రాంతాలకు వెళ్లి పర్యటనలు చేయాలి
- క్షేత్రస్థాయిలో పర్యటించి గడప గడపకు కార్యక్రమాన్ని సమీక్షించాలి
- జిల్లా అధ్యక్షులు, పార్టీ సమన్వయ కర్తలతో కో–ఆర్డినేట్ చేసుకుంటూ పర్యవేక్షణ చేసుకుంటూ ముందుకు సాగాలి, వీరంతా ప్రభావంతంగా పనిచేయాలి
- గడపగడపకూ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలి
- నాణ్యతతో ఈ కార్యక్రమం కొనసాగేలా చూడాల్సిన బాధ్యత మీది
- కార్యక్రమం ఉద్దేశం అందరికీ అవగతం అయ్యేలా చూడాల్సిన బాధ్యత మీది
- కచ్చితంగా నెలలో 6 సచివాలయాల్లో గడపగడపకూ కార్యక్రమం జరిగేలా చూడాలి
- ప్రభుత్వపరంగా క్యాలెండర్ ప్రకారం పథకాలు అందిస్తున్నాం, దీనికి తోడు గడపగడపకూ కార్యక్రమాన్ని
- సమర్థవంతంగా చేసుకుంటే గెలుపు అన్నది అసాధ్యంకానేకాదు
- ప్రతి సచివాలయంలో ప్రాధాన్య పనులకోసం రూ.20లక్షలు ఇవ్వబోతున్నాం
- సక్రమంగా ఆ పనులు జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యతకూడా మీమీద ఉంది
- ప్రతినెలకు ఒక్కో నియోజకవర్గానికి దాదాపు రూ.1.20 కోట్లు పనులు ఇస్తున్నాం
- ఇవి జాగ్రత్తగా జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత మీది
- జిల్లాకమిటీలు, మండల కమిటీలు, నగర కమిటీలు అన్నీకూడా అనుకున్న సమయానికి పూర్తికావాలి
అలాగే పార్టీ అనుబంధ విభాగాల కమిటీల నిర్మాణం కూడా పూర్తికావాలి - మహిళా సాధికారితకోసం ఈప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోంది, పథకాల్లో సింహభాగం వారిదే
- బూత్‌కమిటీల నుంచి అన్నిరకాల కమిటీల్లో కూడా వారికి ప్రాధాన్యత ఉండేలా చూసుకోండి
- ఆగస్టు 4 నుంచి ప్రతి నియోజకవర్గానికి చెందిన 50 మంది కీలక కార్యకర్తలతో భేటీ అవుతా, దీనికి సంబంధించి ప్రణాళిక త్వరలో వెల్లడిస్తాం
అంటూ నేతలకు దిశా నిర్దేశం చేశారు.
Also Read : అభివృద్ధి లక్ష్యాల రిపోర్టింగ్ కూడా ముఖ్యం: సిఎం