Sunday, January 19, 2025
HomeTrending NewsYSRCP: అందరం కలిసి సాగుదాం: జగన్

YSRCP: అందరం కలిసి సాగుదాం: జగన్

పార్టీ ప్రాంతీయ సమన్వయ కర్తలు (రీజినల్ కోర్దినేటర్స్) తనతో ఏ విషయాన్నైనా చర్చించవచ్చని, ఎప్పుడైనా కలవోచ్చని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు.  ‘పార్టీ పరంగా మీరు నాకు టాప్‌ టీమ్’ అంటూ వారితో వ్యాఖ్యానించారు.  పార్టీ  ప్రాంతీయ సమన్వయకర్తలతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగన్ భేటీ అయ్యారు. పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు.

జగన్ చేసిన పలు సూచనలు చేస్తూ…

  • ఎన్నికలకు సంవత్సరం మాత్రమే సమయం ఉంది.
  • పార్టీ రీజినల్‌ కో-ఆర్డినేటర్లుగా మీరు ఓనర్‌షిప్‌ తీసుకోవాలి.
  • మీకు అప్పగించిన వివిధ జిల్లాల్లో పార్టీనేతలను బలోపేతం చేయాల్సిన బాధ్యత మీదే.
  • ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే.. వాటిని సరిదిద్ది అందర్నీ ఒక్కతాటిపైకి తీసుకురావాలి.
  • అంతిమంగా మన అభ్యర్థులకు మంచి మెజార్టీలు రావాలి.
  • ఆ లక్ష్యంతోనే మీరు సంకల్పంతో పనిచేయాలి.
  • సచివాలయ కన్వీనర్ల రూపంలో, గృహసారథుల రూపంలో కింద చక్కటి యంత్రాంగం ఉంది. వాలంటీర్లను వారితో మమేకం చేయాలి.
  • ఈ యంత్రాంగాన్ని చురుగ్గా పనిచేయించడానికి, క్రియాశీలకంగా ఉండడానికి కార్యక్రమాలను నిర్దేశించాం.
  • ఆ కార్యక్రమాలన్నీ సజావుగా, సమర్థవంగా ఆయా నియోజకవర్గాల్లో నడిచేలా మీరు పర్యవేక్షణ, సమన్వయ బాధ్యతలు స్వీకరించండి.
  • మీరు, నేను, పార్టీ యంత్రాంగం అంతా కలిసి ముందుకుసాగాలి.

అంటూ వారికి హితబోధ చేశారు.

Also Read : Jaganannaku Chebudam: ఏప్రిల్ 7నుంచి జగనన్నే మా భవిష్యత్తు

RELATED ARTICLES

Most Popular

న్యూస్