Friday, September 27, 2024
HomeTrending Newsఇది కేంద్ర ప్రభుత్వం పథకం: అశోక్ బాబు

ఇది కేంద్ర ప్రభుత్వం పథకం: అశోక్ బాబు

ప్రభుత్వం అమలు చేస్తోన్న డిబిటి అంటే డూప్లికేట్ బోగస్ ట్రాన్స్ ఫర్ అని తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు అభివర్ణించారు. జగనన్న తోడు కింద ఇప్పటి వరకూ 2,011కోట్ల రూపాయలు ఇచ్చినట్లు నేడు పత్రికలకు ఇచ్చిన ప్రకటనల్లో ప్రభుత్వం చెప్పిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ కింద  జూన్ 20, 2020న దేశవ్యాప్తంగా మొత్తం 32 రాష్ట్రాల్లో కలిపి 48లక్షల 30వేల మందికి ఈ పథకం వర్తింప జేసిందని చెప్పారు. ఏపీలో 2లక్షల 30 వేల మందికి దీని ద్వారా సాయం అందిస్తోందన్నారు. ఈ ప్రభుత్వం తాము 3లక్షల 95వేల మందికి అందిస్తున్నామని చెబుతోందని, వీటిలో రెండు లక్షల 30వేల మందికి కేంద్రమే సాయం అందిస్తోందన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీ తో బ్యాంకులు నేరుగా లబ్దిదారులకు రుణాలు ఇస్తుంటే అవి తాము ఇస్తున్నట్లు చెప్పుకోవడం దిగజారుడు రాజకీయమన్నారు. కేవలం లబ్దిదారుల ఎంపిక వరకే రాష్ట్ర ప్రభుత్వ విధి అని తెలిపారు. మొత్తం లబ్ధిదారులు చెల్లించాల్సిన వడ్డీ మొత్తం 16 కోట్లు అయితే వాటిలో 10 కోట్లు కేంద్రమే ఇస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది ఏటా 6 కోట్ల రూపాయలు మాత్రమేనని వివరించారు.

పిఎం కిసాన్ యోజన పథకంలో కూడా ప్రధాని ఫోటో, పేరు ప్రస్తావించలేదని, ఫోటో లేకపోతే తాము నిధులు నిలిపివేస్తామని కేంద్రం హెచ్చరించడంతో  అప్పుడు వైఎస్సార్ రైతు భరోసా పిఎం కిసాన్ యోజన అని పేరు పెట్టారని అశోక్ బాబు చెప్పారు.  ఈ విషయంలో తాము సమాచార హక్కు చట్టం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకొని బైట పెడతామన్నారు.

Also Read : నేడు జగనన్న తోడు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్