Sunday, January 19, 2025
Homeసినిమామహేష్‌ కోసం జగ్గుభాయ్ నిజమేనా..?

మహేష్‌ కోసం జగ్గుభాయ్ నిజమేనా..?

మహేష్‌ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో భారీ, క్రేజీ మూవీ రూపొందుతోంది. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో మహేష్ కు జంటగా పూజా హేగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ముందుగా యాక్షన్ మూవీ చేయాలనుకున్నారు త్రివిక్రమ్. అయితే.. మహేష్‌ కథ మార్చమని.. చెప్పడంతో మొత్తం మార్చేసి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా సరికొత్తగా కథతో ఈ సినిమా చేస్తున్నారు.

ఇటీవల సారధి స్టూడియోలో ఫస్ట్ షెడ్యూల్ జరిగింది. మహేష్‌ బాబు పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. మహేష్ పెళ్లి రోజు సందర్భంగా విదేశాలకు వెళ్లారు. వచ్చిన తర్వాత సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు. అయితే.. ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ కోసం చాలా మందిని అనుకున్నారు. బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కఫూర్, కన్నడ స్టార్ హీరో ఉపేంద్రను కూడా అనుకున్నారు. అలాగే కోలీవుడ్ స్టార్ల పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి కానీ.. వీళ్లెవరు కాకుండా తెలుగు యాక్టర్ నే ఫైనల్ చేసినట్టు సమాచారం. ఆ యాక్టర్ ఎవరో కాదు జగ్గుభాయ్.. అదేనండి జగపతి బాబు.

త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ గా తెరకెక్కించిన అరవింద సమేత చిత్రంలో జగ్గుభాయ్ విలన్ గా నటించారు. ఈ సినిమా కోసం పరభాషా విలన్ కాకుండా తెలుగు యాక్టర్ తోనే విలన్ పాత్ర చేయించారు. అదే విధంగా మహేష్‌ బాబుతో చేస్తున్న మూవీకి కూడా పరభాషా విలన్ కాకుండా తెలుగు విలన్ అదీ కూడా జగపతిబాబుతోనే చేయించాలని ఫిక్స్ అయ్యారట. గతంలో మహేష్‌ బాబుతో శ్రీమంతుడు చిత్రంలో జగపతిబాబు నటించారు. మంచి విజయం సాధించింది. అందులో ఫాదర్ రోల్ చేస్తే.. ఇందులో విలన్ రోల్ చేయబోతున్నారని సమాచారం. ఆగష్టులో ఈ సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి.. మహేష్‌, త్రివిక్రమ్ కలిసి సరికొత్త రికార్డులు సెట్ చేస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్