Save Trees: రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సంప‌త్ నంది రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సింబా’. అరణ్యం నేపథ్యంలో అల్లుకున్న కథతో సింబాను తెరకెక్కిస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్‌ థ్రిల్లింగ్‌ సబ్జెక్ట్ కు రచయిత సంపత్‌నంది. ‘ది ఫారెస్ట్ మ్యాన్’ అనేది ట్యాగ్ లైన్. సంప‌త్ నంది టీమ్ వ‌ర్క్స్ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ దాస‌రి ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై ముర‌ళీ మోహ‌న్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో సంప‌త్ నంది, రాజేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మేకర్స్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. వెర్సటైల్‌ యాక్టర్‌ జగపతిబాబు ‘సింబా’లో ప్రకృతి తనయుడిగా అద్భుతమైన పాత్రను పోషిస్తున్నారు. అడవుల్లో నివసించే మాచోమ్యాన్‌గా జగపతిబాబును ఈ చిత్రంలో చూపిస్తున్నారు సంపత్‌నంది.

ఫస్ట్ లుక్‌ పోస్టర్‌లో జగపతిబాబు భుజాలమీద చెట్లను మోసుకుంటూ వెళ్లడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ”ప్రకృతి తనయుడు ఇతడు… జగపతిబాబు గారిని సింబాగా పరిచయం చేయడానికి ఆనందిస్తున్నాం. వరల్డ్ ఎన్విరాన్‌మెంట్‌ డే సందర్భంగా ఫారెస్ట్ మ్యాన్‌ సింబాను పరిచయం చేస్తున్నాం” అని మేకర్స్ రాసిన వాక్యాలు అట్రాక్ట్ చేస్తున్నాయి. సింబాకు సంబంధించిన మిగిలిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *