Tuesday, February 25, 2025
Homeసినిమా'రుద్రంగి' ట్రైలర్ రిలీజ్!

‘రుద్రంగి’ ట్రైలర్ రిలీజ్!

తెలంగాణ నేపథ్యంలో ఇంతవరకూ చాలానే సినిమాలు వచ్చాయి. అదే నేపథ్యంతో ఇప్పుడు మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఆ సినిమా పేరే ‘రుద్రంగి’. నాయిక ప్రధానమైన కథాకథనాలతో సాగే సినిమా ఇది. జులై 7వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ సినిమాను రసమయి ఫిల్మ్స్ బ్యానర్ లో తెలంగాణా ప్రముఖ గేయ రచయిత రసమయి బాలకిషన్ నిర్మించాడు. తాజాగా ఈ సినిమా యొక్క ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సినిమా తెలంగాణ ప్రాంతంలో దొరల ఆకృత్యాలను, పరాజయాల కష్టాలను తెలుపుతూ సినిమా రూపొందించారు. రుద్రంగిలో భీంరావ్ దొర గా జగపతి బాబు ప్రతినాయకుడి రోల్ లో నటించారు.

ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా మమతా మోహన్ దాస్ నిలిచింది.చాలా కాలం తరువాత జగపతిబాబు డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్న సినిమాగా ‘రుద్రంగి’ గురించి చెప్పుకోవచ్చు. ఇతర ముఖ్య తారాగణంగా విమల రామన్ .. మమత మోహన్ దాస్ .. కాలకేయ ప్రభాకర్ .. ఆషిశ్ గాంధీ కనిపిస్తున్నారు. రసమయి బాలకిషన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్