Monday, January 20, 2025
Homeసినిమాబాల‌య్య నెక్ట్స్ మూవీ టైటిల్ ‘జై బాల‌య్య‌’?

బాల‌య్య నెక్ట్స్ మూవీ టైటిల్ ‘జై బాల‌య్య‌’?

Jai Balayya: న‌ట సింహం నంద‌మూరి బాల‌కృష్ణ ‘అఖండ’ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన విష‌యం తెలిసిందే. ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను తెర‌కెక్కించిన ఈ సినిమా అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుని బాల‌య్య కెరీర్ లో అద్భుత‌మైన చిత్రంగా.. అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక‌ ఈ సినిమాలో ‘జై బాల‌య్య’ సాంగ్ ఎంత పాపుల‌ర్ అయ్యిందో తెలిసిందే.

ఇప్పుడు ‘జై బాల‌య్య‌’ అనేది బాల‌య్య త‌దుప‌రి చిత్రానికి టైటిల్ గా ఫిక్స్ అయ్యింద‌ని స‌మాచారం. క్రాక్ సినిమాతో స‌క్స‌స్ సాధించిన గోపీచంద్ మ‌లినేనితో బాలయ్య సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తుంది. ఈమ‌ధ్య పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైన ఈ చిత్రాన్ని త్వ‌ర‌లో షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినిమా పాట‌ల్లోని ప‌దాల‌నే టైటిల్ గా పెట్ట‌డం అనేది అప్పుడ‌ప్పుడు జ‌రుగుతుంటుంది.

గ‌తంలో చిరంజీవి త‌న సినిమా పాట‌లోని ప‌దాల‌తోనే బావ గారు బాగున్నారా.. అనే టైటిల్ పెట్ట‌డం జ‌రిగింది. ఇప్పుడు బాల‌య్య.. నెక్ట్స్ మూవీకి జై బాల‌య్య టైటిల్ క‌న్ ఫ‌ర్మ్ చేశార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి.. ఈ టైటిల్ నే ఫిక్స్ చేస్తారో..?  లేక మారుస్తారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్