Saturday, January 18, 2025
Homeసినిమా'భోళాశంకర్'కి 'జైలర్' షాక్

‘భోళాశంకర్’కి ‘జైలర్’ షాక్

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ భోళాశంకర్. ఈ చిత్రానికి మెహర్ రమేష్ డైరెక్టర్. ఇందులో చిరంజీవికి జంటగా తమన్నా, చెల్లెలుగా కీర్తి సురేష్ నటించారు.  ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ‘భోళాశంకర్’ పై అభిమానులు  ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇటీవలే  ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. సినిమా ఈనెల 11న విడుదల కానుంది.  అంతకుముందు రోజే 10న సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా జైలర్ విడుదల కానుంది. దీంతో బాక్సాఫీస్ దగ్గర భోళాశంకర్, జైలర్ ఒక రోజు గ్యాప్ లో పోటీపడనున్నాయి.

ఇద్దరి మధ్య పోటీ నువ్వా..? నేనా..? అన్నట్టు జరగాలి కానీ.. ఓవర్ సీస్ లో మాత్రం వార్ వన్ సైడ్ అన్నట్టుగా సాగుతోందని వార్తలు వస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ పూర్తిగా రజినీకాంత్ కు ఆధిపత్యం తెచ్చేలా జరుగుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్ లో  జైలర్ కు 5 లక్షల డాలర్లు అంటే ఆఫ్ మిలియన్ రాగా, భోళాశంకర్ చాలా స్లోగా కేవలం 1 లక్ష డాలర్లు మాత్రమే దాటిందని వార్తలు వస్తున్నాయి. ఇది నిజంగా భోళాశంకర్ కి షాకే అని చెప్పచ్చు.

జైలర్ ట్రైలర్ వచ్చాక అంచనాలు అమాంతం పెరిగాయి. ‘కావాలయ్యా’ సాంగ్ బాగా రీచ్ అయ్యింది. తమన్నా స్టెప్పులు విశేషంగా ఆకట్టుకున్నాయి. మిగిలిన సాంగ్స్ కుడా బాగానే ఉన్నాయి. టేకింగ్ లో జైలర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ చూపించిన వైవిధ్యం ఆడియన్స్ లో ఫస్ట్ డే చూడాలనే ఇంట్రస్ట్ క్రియేట్ చేసింది. అయితే.. భోళాశంకర్ పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉందనే టాక్ వినిపిస్తోంది. రీమేక్ కావడంతో ఆశించిన స్థాయిలో ఇంట్రస్ట్ క్రియేట్ కావడం లేదు. దీంతో భోళాశంకర్ బాక్సాఫీస్ దగ్గర ఎంత వరకు మెప్పిస్తాడు అనేది ఆసక్తిగా మారింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్