Tuesday, June 17, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపేరు మార్చేద్దాం!

పేరు మార్చేద్దాం!

ప్రస్తుతం మనకు పాకిస్తాన్ తో యుద్ధ వాతావరణం ఉంది. దాంతో చాలామంది ఆ పేరు కూడా తలవడానికి ఇష్టపడటం లేదు. అయితే అనివార్యంగా మన దగ్గర కొన్ని పదాల్లో పాక్ అని వస్తుంది. కొన్ని రకాల స్వీట్లు,ఆకుకూరలు కూడా ఈ లిస్టులో ఉన్నాయి . ముఖ్యంగా మైసూర్ పాక్ ని ఇష్టపడేవాళ్ళకి పెద్ద చిక్కొచ్చి పడింది. అలాగే రోజువారీ జీవితంలో వాడే వేపాకు, కరివేపాకు కూడా. పేరు కోసం వాడకం మానలేం కదా! దాంతో కొంతమంది సోషల్ మీడియా వీరులకి భలే ఐడియాలు పుట్టుకొస్తున్నాయి. కరివేపాకును కరివే భారత్, వేపాకును వే భారత్ అనాలని పోస్టులు పెడుతున్నారు. మైసూర్ పాక్ ను మైసూరు భారత్ అనాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. దాంతో స్పందించిన ఒక స్వీట్ షాప్ యజమాని వినూత్నంగా ఆలోచించి ఆచరించింది.

రాజస్థాన్ లోని జైపూర్ లో త్యోహార్ స్వీట్స్ యజమాని అంజలి జైన్. వీరి షాప్ లో అమ్మే స్వీట్ల పేర్లలో పాక్ అని వచ్చిన వాటి పేర్లు మార్చేశారు. మైసూర్ పాక్ ను మైసూర్ శ్రీ అని మార్చేశారు. అలాగే మోతీ పాక్, గోండ్ పాక్ అనే స్వీట్ల చివర శ్రీ తగిలించి మోతీ శ్రీ, గోండ్ శ్రీ చేశారు. స్వర్ణ భస్మంపాక్, చాందీ భస్మం పాక్ లు స్వర్ణశ్రీ చాందిశ్రీ గా మారాయి. వినియోగదారుల కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు. ఈ లెక్కన ఇంకా ఈ లిస్టు లో ఏమేమి వస్తాయో వేచి చూడాలి .

RELATED ARTICLES

Most Popular

న్యూస్