Sunday, January 19, 2025
HomeTrending Newsఇప్పటం బాధితులకు పవన్ ఆర్ధిక సాయం

ఇప్పటం బాధితులకు పవన్ ఆర్ధిక సాయం

మంగళగిరి నియోజక వర్గంలోని ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్ల కూల్చివేతకు గురైన బాధితులకు ఒక్కొక్కరికీ లక్ష రూపాయల ఆర్ధిక సాయం అందించాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. మొత్తం 53 మంది బాధితులకు ఈ సాయాన్ని అందించనున్నారు.  ఈ విషయాన్ని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల సంఘం ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటనలో తెలియజేశారు.

ఈ  ఏడాది మార్చి 14న జరిగిన జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చారన్న కోపంతోనే ఆ గ్రామంపై కక్ష పెంచుకొని రోడ్ల విస్తరణ పేరుతో ఇళ్లు కూల్చి వేశారని జనసేన ఆరోపిస్తోంది. గత శనివారం పవన్ కళ్యాణ్ ఈ గ్రామంలో పర్యటించి బాధితులకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. నైతిక మద్దతుతో పాటు ఆర్ధికంగా కూడా అండగా నిలబడాలన్న ఉద్దేశంతోనే ఈ భరోసా సాయాన్ని ప్రకటించారని, త్వరలో పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ సాయాన్ని బాధితులకు అందజేశారని మనోహర్ వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్