Saturday, January 18, 2025
Homeసినిమా'దేవర' పైనే దృష్టి పెట్టిన జాన్వీ కపూర్! 

‘దేవర’ పైనే దృష్టి పెట్టిన జాన్వీ కపూర్! 

జాన్వీ కపూర్ బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలా అని చెప్పి ఆమె కెరియర్లో సంచలన విజయాలు లేవు. సినిమాల పరంగా కంటే సోషల్ మీడియా ద్వారా ఆమెకి ఫాలోయింగ్ ఎక్కువగా ఉందంటేనే కరెక్టుగా ఉంటుంది. జాన్వీ కపూర్ ను యూత్ ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటుంది. ఆమె ఖాతాలో భారీ హిట్లు లేకపోయినా, ఆమె కెరియర్ పై అది అంతగా ప్రభావం చూపకపోవడానికి కారణం యూత్ లో ఉన్న క్రేజ్ అనే చెప్పాలి.

జాన్వీ కపూర్ ను టాలీవుడ్ కి పరిచయం చేయడానికి చాలామంది దర్శకులు గట్టిగానే ప్రయత్నాలు చేశారు. కానీ కొరటాల – ఎన్టీఆర్ కాంబినేషన్ లో చేయడానికి మాత్రమే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో ఈ సినిమాకి జాన్వీ కపూర్ ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. శ్రీదేవి తమిళ .. తెలుగు .. హిందీ సినిమాలు ఎక్కువగా చేసింది. అందువలన దక్షిణాదిన ‘మన శ్రీదేవి కూతురు’ అనే ఫీలింగ్ ఆడియన్స్ లో ఉంది. థియేటర్స్ కి జనాలను రప్పించడానికి ఈ ఆసక్తి సరిపోతుంది.

ప్రస్తుతం ‘దేవర’ తాజా షెడ్యూల్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ఎన్టీఆర్ .. జాన్వీ కపూర్ తదితరులపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లిన దగ్గర నుంచి తెలుగు స్టార్ హీరోల సినిమాల నుంచి జాన్వీకి వరుస ఆఫర్లు వస్తూనే ఉన్నాయట. అయితే ‘దేవర’ పాన్ ఇండియా సినిమా కావడంతో, ఈ సినిమా రిజల్టు చూసిన తరువాతనే మరో తెలుగు సినిమాను అంగీకరించాలనే ఉద్దేశంతో ఆమె ఉందని అంటున్నారు. వచ్చే ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్