Saturday, January 18, 2025
Homeసినిమాచరణ్‌ మూవీలో జాన్వీ. ఇది నిజమా..?

చరణ్‌ మూవీలో జాన్వీ. ఇది నిజమా..?

రామ్ చరణ్‌, బుచ్చిబాబు కాంబినేషన్లో భారీ పాన్ ఇండియా మూవీని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాను 2023లో భారీ స్థాయిలో ప్రారంభించనున్నారు. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి ఈ సినిమా స్టోరీ ఏంటి..? బుచ్చిబాబు ఎన్టీఆర్ కు చెప్పిన కథే చరణ్‌ కు చెప్పాడా..?  లేక ఇది వేరే కథా.? అనే అనుమనాలు మొదలయ్యాయి.

ఇంతకీ విషయం ఏంటంటే… ఎన్టీఆర్ తో చేయాలనుకున్న కథే అక్కడ సెట్ కాకపోవడంతో చరణ్‌ కు చెప్పాడు. కథ నచ్చి చరణ్‌ ఓకే చెప్పాడు. అయితే.. ఈ మూవీకి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే… ఇందులో ఒక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ని బరిలో దించడం ద్వారా పాన్ ఇండియా అప్పీల్ తేవాలన్న ప్లాన్ అయితే ఉంది. కానీ ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంటుంది. జాన్వీ కపూర్ ని దాదాపు ఖరారు చేశారని టాక్ వినిపిస్తోంది. జాన్వీ కూడా తెలుగులో నటించేందుకు రెడీగానే ఉంది.

ప్రస్తుతం చరణ్ శంకర్ డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. న్యూజిలాండ్ లో పాట చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ నటిస్తుంది. గతంలో వీరిద్దరూ కలిసి ‘వినయ విధేయ రామ’ అనే సినిమాలో నటించారు. ఆ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ ఈ సినిమాలో కైరా అద్వానీకి ఛాన్స్ ఇవ్వడం విశేషం. చరణ్‌, జాన్వీ కాంబినేషన్ కోసం ఎప్పటి నుంచో మేకర్స్ ట్రై చేస్తున్నారు. ఇన్నాళ్లు సెట్ కాలేదు. మరి.. ఇప్పుడు సెట్ అవుతుందేమో చూడాలి. ఇదే కనుక జరిగితే ఈ ప్రాజెక్ట్ కి మరింత క్రేజ్ రావడం ఖాయం.

Also Read : రామ్ చ‌ర‌ణ్‌, బుచ్చిబాబు కాంబోలో పాన్ ఇండియా మూవీ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్