Saturday, January 18, 2025
HomeTrending Newsఅందరం ఒక్కటై పనిచేద్దాం: జగన్ పిలుపు

అందరం ఒక్కటై పనిచేద్దాం: జగన్ పిలుపు

జనవరి నుంచి పాలనలో అడుగులు మరింత వేగంగా ముందుకు పడనున్నాయని, పార్టీ తరఫున ఏర్పాటు చేయబోతోన్న బూత్‌ కమిటీలు ప్రతి పథకాన్ని ప్రజలకు ఇంకా బాగా అందజేస్తారని, ప్రతి పనిలో వారు  భాగస్వామ్యు లవుతారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. ప్రతి సచివాలయానికి ముగ్గురు కన్వీనర్లు. వారిలో ఒకరు మహిళ ఉంటారని, వారిని ఎమ్మెల్యే ఎంపిక చేస్తారని, అలాగే ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు గృహ సారథులు. ఒక తమ్ముడు, ఒక చెల్లెమ్మ ఉంటారని… వీరు ఏ ఒక్కరికీ సంక్షేమం ద్వారా మిస్‌ కాకుండా చూస్తారని తెలిపారు.  క్యాంప్‌ కార్యాలయంలో ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం నియోజకవర్గం కార్యకర్తలతో  జగన్‌ భేటీ అయ్యారు. పలు అంశాలపై వారికి దిశా నిర్దేశం చేశారు.

జగన్ మాట్లాడుతూ….

  • గడప గడపకూ కార్యక్రమంతో ప్రజలవైపు అడుగులు వేగంగా వేస్తున్నాం.
  • మైలవరం నియోజకవర్గంలో సుమారు 89 శాతం ఇళ్లకు మేలు జరిగింది.
  • వివిధ పథకాల్లో ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా దాదాపు రూ.900 కోట్ల నగదు నియోజకవర్గంలోని ఇళ్లకు చేరింది.
  • ప్రతి ఇంట్లో ఎంతెంత మేలు జరిగిందన్న పూర్తి వివరాలు కూడా ఉన్నాయి.
  • ఇంత మంచి చేసిన ప్రభుత్వానికి మీ ఆశీస్సులు కావాలన్న గొప్ప కార్యక్రమం.
  • ఎక్కడైనా, ఎవరైనా మిగిలిపోయి ఉంటే, వారిని వదిలేయకుండా మంచి చేయడం కోసం కూడా గడప గడపకూ కార్యక్రమం.
  • మరోవైపు ప్రతి సచివాలయంలో అభివృద్ధి పనుల కోసం రూ.20 లక్షలు కేటాయించాం.

  • ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లాలి. ప్రతి సచివాలయంలో కనీసం 2 రోజులు తిరగాలి.
  • కనీసం రోజుకు 5 లేక 6 గంటలు గడపాలని చెబుతున్నాం. దాని వల్ల ఎమ్మెల్యేలు మీకు దగ్గర అవుతారు.
  • దాంతో సచివాలయాలు కూడా మీకు మరింత చేరువవుతాయి.
  • ఇంకా రూ.20 లక్షల పనుల వల్ల గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతాయి.
  • ఈసారి మన టార్గెట్‌ 175కు 175. అదే మన లక్ష్యం. అది కష్టం కూడా కాదు.
  • ఎందుకంటే గతంలో ఏనాడూ లేని విధంగా ఇవాళ పరిపాలన సాగుతోంది.
  • గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకుంటే, 89 శాతం ఇళ్లకు పూర్తి పారదర్శకంగా ప్రతి ఒక్కటి అందుతోంది. ఎక్కడా అవినీతికి తావు లేదు.
  • ఇంకా ఎక్కడా అవినీతికి తావు లేకుండా పథకాలు అందుతున్నాయి.
  • సచివాలయాలు ఇంటి గడప వద్దే సేవలందిస్తున్నాయి. ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వలంటీర్లు. ప్రతి 50 ఇళ్లకు ఇక వలంటీర్‌. ప్రతి ఒక్కరిని చేయి పట్టుకుని నడిపిస్తున్న వ్యవస్థ.
  • ఒకటి యథావిథిగా పథకాలు అమలు చేయడం కాగా, రెండోది మీరు, ఎమ్మెల్యే కలిసి, అందరూ ఒక్కటై.. మనం చేస్తున్న పనిని ప్రతి ఇంట్లో వివరించి, వారి ఆశీర్వాదం తీసుకోవాలి.
  • అలా అందరూ కలిసికట్టుగా పని చేస్తే మొత్తం 175 సీట్లు గెల్చుకోగలం. ఇవన్నీ సవ్యంగా జరగడం కోసమే నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నాం ….. అంటూ వారికి హితబోధ చేశారు.

మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌. పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్లు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి (ఎంపీ), మర్రి రాజశేఖర్‌ (మాజీ ఎమ్మెల్యే) తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్