Monday, January 20, 2025
HomeసినిమాAkhil-Janvi: అఖిల్ తదుపరి చిత్రంలో జాన్వీ కపూర్?

Akhil-Janvi: అఖిల్ తదుపరి చిత్రంలో జాన్వీ కపూర్?

అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ పై అఖిల్ చాలా ఆశలు పెట్టుకున్నాడు కానీ.. ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేక బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. దీంతో అఖిల్ నెక్ట్స్ సినిమా ఏంటి..? ఎవరితో ఉంటుంది.? ఏ తరహా చిత్రం చేయనున్నాడు..? అనేది ఆసక్తిగా మారింది. ఏజెంట్ ఫ్లాప్ అవ్వడంతో డీలా పడ్డ అఖిల్ దుబాయ్ లో రెస్ట్ తీసుకుంటున్నాడు. దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత నెక్ట్స్ మూవీని అనౌన్స్ చేయనున్నాడని తెలిసింది.

ఇంతకీ అఖిల్ తదుపరి చిత్రం ఎవరితో అంటే.. ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వీ. క్రియేషన్స్ లో చేయనున్నాడని తెలిసింది. ఏజెంట్ మూవీ ప్లాప్ అవ్వడంతో యువీలో సినిమా ఉంటుందో ఉండదో అనే టాక్ వచ్చింది కానీ.. ఏజెంట్ ఫలితంతో సంబంధం లేకుండా అఖిల్ తో సినిమా చేసేందుకు ముందుకు వచ్చారట. ఈ సినిమాకి నూతన దర్శకుడు అనిల్ దర్శకత్వం వహించనున్నాడని తెలిసింది. మరో విషయం ఏంటంటే.. ఇందులో అఖిల్ కు జంటగా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించనుందని సమాచారం.

ఈ సినిమాకి ధీర అనే టైటిల్ ఖరారు చేశారని టాక్ వినిపిస్తుంది. కథ నచ్చడం వలనే అనిల్ నూతన దర్శకుడు అయినప్పటికీ వర్క్ చేయాలని అఖిల్ డిసైడ్ అయ్యాడట. అనిల్ సాహో, రాధేశ్యామ్ చిత్రాలకు డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో వర్క్ చేశాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అతి త్వరలో అనౌన్స్ చేసి త్వరగా షూటింగ్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారట. ఇప్పటి వరకు అఖిల్ తన సినిమాల విషయంలో సొంత నిర్ణయాలు తీసుకున్నాడు. ఇక నుంచి అఖిల్ సినిమాల వ్యవహరాలు నాగార్జునే చూడాలనుకుంటున్నారట. మరి.. ఇక నుంచైనా అఖిల్ కి సక్సెస్ వస్తుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్