Sunday, January 19, 2025
Homeసినిమాహాట్ స్టార్ లో జీతూ జోసెఫ్ సూపర్ హిట్ మూవీ!

హాట్ స్టార్ లో జీతూ జోసెఫ్ సూపర్ హిట్ మూవీ!

జీతూ జోసెఫ్ .. మలయాళంలో స్టార్ డైరెక్టర్. 2007లో దర్శకుడిగా ఆయన తన కెరియర్ ను మొదలెట్టారు. అప్పటి నుంచి ఆయన వరుసగా సినిమాలు చేస్తూ వెళుతున్నారు. మొదటి నుంచి కూడా ఆయన మలయాళ సినిమాలనే ఎక్కువగా తెరకెక్కిస్తూ వస్తున్నారు. తమిళ .. తెలుగు .. హిందీ భాషల్లో ఆయన ఒక్కో సినిమాను మాత్రమే చేశారు. తమిళంలో కార్తీ హీరోగా చేసిన ‘తంబి’ ఆయన కెరియర్లో ప్రత్యేకమైన సినిమాగా నిలిచింది. ఇక తెలుగులో ఆయన ‘దృశ్యం 2’ సినిమాను తెరకెక్కించారు.

మలయాళంలో స్టార్ డైరెక్టర్స్ చాలామంది కనిపిస్తారు. భారీ సినిమాలను రూపొందించేవారు కొందరైతే, కథకి మాత్రమే ప్రాధాన్యతనిస్తూ, కథను బట్టి హీరోలను ఎంచుకునే వారు కొందరు.ఇక సహజత్వానికి మాత్రమే ప్రాముఖ్యతనిచ్చేవారు మరికొందరు. ఈ లక్షణాలతో పాటు మరో ప్రత్యేకత కూడా జీతూలో కనిపిస్తుంది. అదీ .. షూటింగును చాలా తక్కువ రోజులలో ముగించడం. అయినా ఆ సినిమాలు సంచలన విజయాలను నమోదు చేయడం.

జీతూ జోసెఫ్ నుంచి ‘దృశ్యం’ .. ‘దృశ్యం 2’ .. ‘కూమన్’ వంటి సినిమాలు వచ్చాయి. ఈ కథల్లోని పాత్రలు నిజజీవితంలో నుంచి పుట్టినట్టుగానే ఉంటాయి. సహజత్వానికి చాలా దగ్గరగా కనిపిస్తాయి. దాదాపు 40 రోజుల్లోనే ఆయన తన సినిమాను పూర్తి చేస్తారు .. అది కూడా రియల్ లొకేషన్స్ లో. చాలా తక్కువ బడ్జెట్ లో ఆయన రూపొందించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టాయి. ఆయన తాజా చిత్రంగా వచ్చిన ‘నెరు’ .. 80 కోట్లకు పైగా వసూలు చేసింది. నిన్నటి నుంచి ‘హాట్ స్టార్’ లో అందుబాటులోకి వచ్చింది. మోహన్ లాల్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా,  ఎమోషనల్ గా ప్రతి ఒకరి మనసును టచ్ చేస్తుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్