కృష్ణపట్నం పోర్టు సమీపంలో పదివేల కోట్ల రూపాయల పెట్టుబడితో 3మిలియన్ టన్నుల సామర్ధ్యంతో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తున్నట్లు జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ నవీన్ జిందాల్ ప్రకటించారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ప్రసంగిస్తూ ఈ విషయం వెల్లడించారు. ఈ ప్లాంట్ ద్వారా పదివేల మందికి ఉపాధి లభిస్తుందని, ఈరోజు ఎంవోయూ కుడుర్చుకున్తున్నామని తెలిపారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రగతిలో భాగం అవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని నవీన్ చెప్పారు. యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సారధ్యంలో పారిశ్రామికాభివృద్ధికి ఎన్నో అవకాశాలు,ప్రోత్సాహకాలు లభిస్తున్నాయని తెలిపారు. ఇటీవలే సజ్జన్ జిందాల్ ఇటీవలే కడప స్టీల్ ప్లాంట్ పనులకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. ఇది సిఎం జగన్ కు డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పారు. పునరుత్పాదక రంగంలో జే ఎస్ డబ్ల్యూ గ్రూప్ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉందన్నారు.