దీపావళికి 5G అందుబాటులోకి తీసుకొస్తామని రిలయన్స్ చైర్మన్ ముకేష్ అంబాని ఈ రోజు ప్రకటించారు. మొదటగా ఢిల్లీ, ముంబై, చెన్నై, కలకత్తా నగరాలతో పాటు మరి కొన్ని నగరాల్లో లాంచ్ చేస్తామని వెల్లడించారు. ఆ తర్వాత పట్టణాలు, గ్రామాలకు విస్తరించి 2023 డిసెంబర్ నాటికి దేశం మొత్తాన్ని కవర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని ముఖేష్ అంబానీ వాటాదారులకు చెప్పారు.
Jio 5G నెట్వర్క్ కోసం రెండు లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు ముఖేష్ అంబాని పేర్కొన్నారు.