Saturday, November 23, 2024
HomeTrending Newsతెలంగాణ పోలీసు శాఖ‌లో కొలువుల మేళా

తెలంగాణ పోలీసు శాఖ‌లో కొలువుల మేళా

తెలంగాణ పోలీసు శాఖ‌లో మ‌రోసారి కొలువుల జాత‌ర మొద‌లైంది. ఆ శాఖ‌లో భారీగా ఖాళీలు ఉన్న‌ట్లు సీఎం కేసీఆర్ శాస‌న‌స‌భా వేదిక‌గా ఈ రోజు ప్ర‌క‌టించారు. 18,334 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు విడుద‌ల చేస్తామ‌ని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డినప్ప‌టి నుంచి గ‌తేడాది వ‌ర‌కు పోలీసు శాఖ‌లో 31,972 ఉద్యోగ నియామ‌కాలు చేప‌ట్టారు. తాజాగా 18,334 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ వెలువ‌డ‌నుంద‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. 2013-14 లో పోలీసు శాఖలో మొత్తం 63,181 మంది ఉద్యోగులుండగా, 2019-20 నాటికి వీరి సంఖ్య 86,829 కి పెరిగింది. ప్ర‌స్తుతం ప్ర‌క‌టించిన నియామ‌కాలు భ‌ర్తీ అయితే ఈ సంఖ్య ల‌క్షకు పైగా చేరుకోనుంది.

పోలీసు శాఖ‌లో భారీగా ఖాళీలు ఉండ‌టంతో.. ఆ పోస్టుల‌కు స‌న్న‌ద్ధ‌మ‌య్యే అభ్య‌ర్థులు ఉత్సాహంగా ఉన్నారు. ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు ప్రిపేర‌య్యే అభ్య‌ర్థులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే వారు ఆ ఉద్యోగానికి కావాల్సిన ప్రిపరేష‌న్‌ను మొద‌లు పెట్టారు. స్పోర్ట్స్ గ్రౌండ్స్‌లో కఠోర సాధ‌న చేస్తున్నారు. ఫిజిక‌ల్ ఎక్స‌ర్‌సైజ్‌పై దృష్టి సారించారు.

ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి కృత‌జ్ఞ‌త‌లు

ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావుకు రాష్ట్ర డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. పోలీసు శాఖ‌లో 2014 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 45,113 ఉద్యోగాల భ‌ర్తీ చేప‌ట్ట‌డంతో పాటు త‌మ‌కు నిరంత‌రం మ‌ద్ద‌తు ఇస్తున్న సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర పోలీసుల త‌ర‌పున హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్న‌ట్లు డీజీపీ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. తెలంగాణ పోలీసులు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అంకిత‌భావంతో ప‌ని చేస్తామ‌ని హామీ ఇస్తున్న‌ట్లు డీజీపీ వెల్ల‌డించారు.

Also Read : శాఖలు, జిల్లాల వారిగా..ఉద్యోగాల ఖాళీలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్