Thursday, November 21, 2024
Homeస్పోర్ట్స్Ind Vs Eng: ఆదుకున్న రూట్ - ఇంగ్లాండ్ 302/7

Ind Vs Eng: ఆదుకున్న రూట్ – ఇంగ్లాండ్ 302/7

ఇండియా-ఇంగ్లాండ్ మధ్య రాంచిలో నేడు మొదలైన నాలుగో టెస్టులో  ఆతిథ్య జట్టు మొదట్లో తడబడ్డా ఆ తర్వాత నిలదొక్కుకుంది. జో రూట్ సెంచరీ (106)తో ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. రూట్ కు టెస్టుల్లో ఇది 31వ సెంచరీ కావడం గమనార్హం.

విశ్రాంతి కోసం పేసర్ జస్ ప్రీత్ బుమ్రా వైదొలగడంతో జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్న ఆకాష్ దీప్  మొదటి మ్యాచ్ లోనే సత్తా చాటాడు. పదునైన బంతులతో ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ ను ఇబ్బంది పెట్టి తొలి మూడు వికెట్లూ పడగొట్టాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లోనే చక్కని బంతితో జాక్ క్రాలే ను బౌల్డ్ చేశాడు. అయితే అది నో బాల్ కావడంతో ఆకాష్ తన తొలి టెస్ట్ వికెట్ కోసం పదో ఓవర్ వరకూ ఆగాల్సి వచ్చింది.

ఉదయం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ తొలి వికెట్ కు 47 పరుగులు (బెన్ డకేట్-11) చేసింది. అదే స్కోరు వద్ద ఓలీ పోప్ డకౌట్ గా వెనుదిరిగాడు. 57 వద్ద మరో ఓపెనర్ జాక్ క్రాలే (42) కూడా ఔట్ కావడంతో ఇంగ్లాండ్ కష్టాల్లో పడింది. బెయిర్ స్టో వేగంగా ఆడి 35 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ తో 38 పరుగులు చేసి వెనుదిరగ్గా, కెప్టెన్ బెన్ స్టోక్స్ (3) విఫలమయ్యాడు. ఈ దశలో రూట్- బెన్ ఫోక్స్ లు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు. ఫోక్స్ 47 రన్స్ సాధించగా, టామ్ హార్ట్ లీ 13 మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.

మొదటిరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ ఏడు వికెట్లు కోల్పోయి 307 పరుగులు సాధించింది. రూట్ 106, ఓలీ రాబిన్సన్-31 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లు ఆకాష్ దీప్ 3; సిరాజ్ 2; అశ్విన్-సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్