Saturday, January 18, 2025
HomeసినిమాNara Rohit: దర్శకుడిగా జర్నలిస్ట్ మూర్తి

Nara Rohit: దర్శకుడిగా జర్నలిస్ట్ మూర్తి

తెలుగు జర్నలిజంలో  తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్న మూర్తి సినిమా దర్శకుడిగా సరికొత్త అవతారం ఎత్తనున్నారు. గతంలో ఓ సినిమాలో  ఓ ప్రత్యెక పాత్ర పోషించారు.  కొంత కాలంగా నటనకు దూరంగా ఉన్న నారా రోహిత్  మళ్ళీ ఓ సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇది రోహిత్ కు  19వ సినిమా, దీనికి దర్శకత్వం మూర్తి వహించనున్నారు. ఈ విషయాన్ని మూర్తి స్వయంగా సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు.

“జర్నలిస్ట్ గా నా మదిలో మెదిలిన ఒక ఆలోచనను కథగా మార్చాను. ఆ కథని నమ్మి నన్నే దర్శకత్వం చెయ్యమన్నారు,నా మొదటి సినిమా హీరో నారా రోహిత్. హీరో పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నాం. నా 30 ఏళ్ళ జర్నలిజం జీవితంలో నేను వేసే ప్రతిఅడుగులో నాకు తోడుగా ఉంటున్నారు. ఇప్పుడు వేసే ఈ అడుగులోనూ అండగా ఉంటారు అని ఆశిస్తూ” అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.

‘ప్రతినిధి 2’ అనే టైటిల్ తో రూపొందుతోంది. నేడు టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్