భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ సారథి మిథాలీ రాజ్ ను నేడు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా కలుసుకున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర మూడో విడత ముగింపు సభ నేడు హన్మకొండలో జరగనుంది. ఈ సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ చేరుకున్న నడ్డా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ నేతలు డా. లక్ష్మణ్, తరుణ్ చుగ్, తదితరులతో కలిసి శంషాబాద్ లోని హోటల్ నోవాటెల్ కు చేరుకున్నారు. అక్కడ మితాలీతో నడ్డా భేటీ అయ్యారు. భారత మహిళా క్రికెట్ కు మిథాలీ సేవలను నడ్డా కొనియాడారు.
వివిధ రంగాల్లో ప్రముఖులైన వ్యక్తులను బిజెపి నేతలు గత కొంత కాలంగా కలుస్తూ వస్తున్నారు. దీనిలో భాగంగానే గత ఆదివారం మునుగోడు పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తిరుగు పయనంలో హైదరాబాద్ లోని నోవాటెల్ లోనే హీరో జూనియర్ ఎన్టీఆర్ ను కలుసుకున్న సంగతి తెలిసిందే. ఈ పరంపరలోనే నడ్డా-మిథాలీ భేటీ జరిగినట్లు బిజెపి నేతలు తెలిపారు.
Also Read : మొన్న ఎన్టీఆర్, నేడు నితిన్