Tuesday, January 21, 2025
Homeసినిమాఎన్టీఆర్ పాన్ వరల్డ్ మూవీ ప్లాన్ చేస్తున్నాడా..?

ఎన్టీఆర్ పాన్ వరల్డ్ మూవీ ప్లాన్ చేస్తున్నాడా..?

 ఆర్ఆర్ఆర్ మూవీలోని కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించి మెప్పించారు. ఈ సినిమాతో మన దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీలోని ‘నాటు నాటు’ సాంగ్ గోల్డన్ గ్లోబ్ అవార్డ్, ఆస్కార్ అవార్డ్ అందుకోవడంతో ఎన్టీఆర్ ఒక్కసారిగా గ్లోబల్ స్టార్ అయ్యారు. దీంతో ఎన్టీఆర్ తో మూవీ చేసేందుకు బడా ఫిల్మ్ మేకర్స్ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అయితే.. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివతో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందించనున్నారు.

ఈ నెలలో షూటింగ్ స్టార్ట్ చేసి.. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ తో సినిమా చేయనున్నారు. ఈ చిత్రాన్ని  మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. అయితే.. ఈ చిత్రాన్ని ముందుగా పాన్ ఇండియా మూవీగా చేయాలి అనుకున్నారు కానీ.. ఇప్పుడు ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అవ్వడంతో పాన్ వరల్డ్ మూవీగా చేయాలి అనుకుంటున్నారట. భారీ యాక్షన్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

ఈ సినిమాని ఇంగ్లీష్‌లో కూడా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అలాగే, ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేయనున్నారట. అంతే కాకుండా ఈ సినిమాకి సంబంధించిన నటీనటులను కూడా హాలీవుడ్ వాళ్లను తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట మేకర్స్. ఏది ఏమైనా యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో భారీ యాక్షన్ డ్రామా అదీ కూడా పాన్ వరల్డ్ మూవీగా వస్తే ఖచ్చితంగా అది అన్ని వర్గాల ప్రేక్షకులను థ్రిల్ చేస్తోంది. బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో చూడాలి.

Also Read : ఎన్టీఆర్ మూవీ కోసం జాన్వీ అంతలా ఎదురు చూస్తుందా.?

RELATED ARTICLES

Most Popular

న్యూస్