Sunday, January 19, 2025
HomeసినిమాAgent Pre Release: 'ఏజెంట్' కోసం ఆర్ఆర్ఆర్ హీరోలు..?

Agent Pre Release: ‘ఏజెంట్’ కోసం ఆర్ఆర్ఆర్ హీరోలు..?

అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే.. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఏజెంట్ ఇంకా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఏప్రిల్ 28న రిలీజ్ అని ప్రకటించారు కానీ.. ఇంకా ఓ సాంగ్ షూట్ చేయాలి. అలాగే కొంత ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ ఉందని సమాచారం. అయితే.. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ 28న ఏజెంట్ మూవీని రిలీజ్ చేస్తామని అనిల్ సుంకర మరోసారి ప్రకటించారు.

మిగిలిన ఆ సాంగ్ షూట్ చేయకపోయినా సరే.. సినిమాని రిలీజ్ చేస్తానని అనిల్ సుంకర చెబుతున్నారంటే.. ఈసారి రిలీజ్ మీద ఎంత పట్టుదలగా ఉన్నారో అర్థం అవుతుంది. ఇటీవల ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. దీనికి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ సింగిల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఏప్రిల్ నుంచి ప్రమోషన్స్ లో స్పీడు పెంచనున్నారట. ఇక అసలు విషయానికి వస్తే.. ఏప్రిల్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేస్తున్నారట. ఈ ఈవెంట్ కు ‘ఆర్ఆర్ఆర్’ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని టాక్ వినిపిస్తోంది.

ఇదే కనుక జరిగితే… మెగా, అక్కినేని, నందమూరి అభిమానులకు కన్నుల పండుగ అవుతుంది అనడంలో సందేహం లేదు. ఈ పాన్ ఇండియన్ మూవీలో మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎకె ఎంటర్టైన్‌మెంట్స్‌, సురేందర్‌ 2 సినిమా బ్యానర్‌ల పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథను అందించారు. హిప్ హాప్ తమిజా ఈ చిత్రానికి సంగీత అందిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి.. అక్కినేని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్న బ్లాక్ బస్టర్ ను ఏజెంట్ అందిస్తుందేమో చూడాలి.

Also Read : ఏజెంట్ హిట్ అయితే.. నాగ్ మూవీకి క్రేజ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్