Greyhounds Lands : రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవుల గ్రామంలో పోలీస్ శాఖకు ( గ్రేహౌండ్స్) కేటాయించిన భూములపై హైకోర్టు ఈ రోజు కీలక తీర్పు వెలువరించింది. సర్వే నెంబర్ 391/1 నుంచి 391/20 వరకు ఉన్న 142 ఎకరాల భూమి ప్రభుత్వ భూమేనని హైకోర్టు తీర్పు ఇచ్చింది. పోలీసు శాఖకు ప్రభుత్వం కేటాయించిన భూములపై హైకోర్టు లో 2010లో పిటిషన్ వేసిన కొందరు వ్యక్తులు అది తమ పూర్వికులదని, తమకు వారసత్వంగా వచ్చిందని వాదించారు.
సుధీర్ఘంగా దశాబ్దకాల విచారణ అనంతరం ఇవాళ తీర్పు తెలంగాణ హైకోర్టు ఇచ్చింది. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన హైకోర్టు. ఈ భూముల విలువ దాదాపు 10వేల కోట్లు ఉంటుందన్న హైకోర్టు, ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తుల పరం కాకుండా టీఎస్ డీజీపీ, గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీ, అడ్వకేట్ జనరల్, రంగారెడ్డి కలెక్టర్, ఆర్డీవో, గండిపేట ఎమ్మార్వో విశేషంగా కృషి చేశారని అభినందించింది. ఇప్పటికే ఆ భూములను కబ్జా చేసి… వెంచర్లు వేసిన రియల్టర్లు, కబ్జాదారులపై నాంపల్లి కోర్టులో క్రిమినల్ కేసు నమోదు చేయాలని హైకోర్టు ఛీఫ్ జస్టీస్ ఆదేశించారు.
Also Read : 317 జీవో సవరించాలి – బిజెపి