Saturday, January 18, 2025
Homeసినిమాఎస్పీ బాలుకు తెలుగు పరిశ్రమ స్వర నీరాజనం

ఎస్పీ బాలుకు తెలుగు పరిశ్రమ స్వర నీరాజనం

బాలూ .. అందరు ముద్దుగా పిలుచుకునే పేరు ..! అంతే కాదు సంగీత సాగరంలో మనల్ని ఓలలాడించి సంగీత ప్రియులను తన గానామృతంతో పులకింపచేసిన పేరది ! శ్రీ పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం అంటే అందరికి తెలియకపోవచ్చు .. కానీ ఎస్పీ బాలు అంటే చాలు .. మధురమైన గీతాలే గుర్తొస్తాయి. ఒక్క తెలుగులోనే కాదు దాదాపు అన్ని భాషల్లో కలిపి నలభైవేలకు పైగా పాటలు పాడిన మహా గాయకుడు బాలు !! అయన ఆకస్మిక మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు. అయన లేని లోటు ఎప్పటికి తీర్చ లేనిది. రేపు ఎస్పీ బాలు జయంతి, ఈ సందర్బంగా యావత్ తెలుగు చిత్రసీమ ఆయనకు ట్రిబ్యూట్ అందిస్తుంది. జూన్ 4న అనగా రేపు ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ”ఎస్పీ బాలుకు స్వరనీరాజనం” కార్యక్రమం ‘ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్’ యూట్యూబ్ ఛానల్, మరియు ‘సంతోషం సురేష్’ యూట్యూబ్ చానెల్స్ లో 12 గంటల పాటు లైవ్ ప్రోగ్రామ్ కంటిన్యూ గా ప్రసారం అవుతుంది.

ఈ విషయం గురించి సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ మాట్లాడుతూ .. బాలుగారి జన్మదినోత్సవం … బాలుగారి జయంతి రేపు జూన్ 4న తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అందరం కలిసి ఓ ట్రిబ్యూట్ ఇస్తున్నాం. ఈ ట్రిబ్యూట్ ఇస్తున్న వారంతా బాలూ గారితో ఉన్న అనుబంధాలను కూడా పంచుకుంటారు. మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అందరం కలిసి చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగా ‘ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్’ యూట్యూబ్ ఛానల్, మరియు ‘సంతోషం సురేష్’ యూట్యూబ్ చానెల్స్ ద్వారా చూసే అవకాశం ఉంది.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సెక్రటరీ నటి జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ .. ఇలాంటి ఒక రోజు వస్తుందని కలలోకూడా అనుకోలేదు. ఎస్పీ బాలు గారు లేకుండా అయన పుట్టినరోజు జరుపుకోవడం అన్నది దురదృష్టకరం. నేనిప్పటికీ అయన లేరంటే నమ్మలేకపోతున్నాను. నాలాగా కొన్ని కోట్ల మంది కూడా నమ్మలేకపొతున్నారు. ఈ పుట్టినరోజు ఆయనకు 75 వ జయంతి. అందుకే రేపు జూన్ 4న ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్లు ఇలా అందరు కలిసి చక్కని ప్రోగ్రాం ఏర్పాటు చేశారు’ అని వివరించారు

డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దర్శకుడు ఎన్ శంకర్ మాట్లాతుడు .. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్బంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అందరు కలిసి ఓ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. వారెక్కడున్న మరచిపోకుండా ఓ మంచి కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 10 నుండి రాత్రి పదిగంటల వరకు బాలు గారి అభిమానులను, సంగీత ప్రియులను ఆకట్టుకునేలా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది’ అని తెలిపారు.

నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ… ‘బాలు గారు సింగర్ గానే కాదు నిర్మాతల మండలిలో సభ్యుడు, నిర్మాతగా కూడా విశ్వనాధ్ గారి దర్శకత్వంలో కమల్ హాసన్ తో శుభ సంకల్పం అనే సినిమా తీసిన గొప్ప నిర్మాత. ఒక గాయకుడిగానే కాదు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా భారదేశంలో ఉన్న అన్ని భాషల్లో పాటలు పాడిన గొప్ప సింగర్ అయన’ అని కొనియాడారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్