తెలంగాణలో జూనియర్ డాక్టర్లు, రెసిడెంట్ డాక్టర్లు నేటి నుంచి సమ్మె బాట పట్టారు. అత్యవసర సేవలు మినహా అన్ని విధులు బహిష్కరిస్తున్నారు. మొత్తం నాలుగు డిమాండ్లలో కేవలం ఒక్కటి మాత్రమే ప్రభుత్వం నెరవేర్చిందని, మిగిలిన మూడింటిపై కూడా వెంటనే స్పందించాలని కోరుతున్నారు. లేకపోతె రెండ్రోజుల్లో అత్యవసర, కోవిడ్ వైద్య సేవలు కూడా బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు. ఇటీవల స్టైఫండ్ పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
స్టైఫండ్ పెంచాలని, కోవిడ్ తో మరణించిన హెల్త్ కేర్ సిబ్బందికి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని జూడాలు డిమాండ్లు పెట్టారు. వైద్య సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు కోవిడ్ వస్తే నిమ్స్ లో చికిత్స అందించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కోవిడ్ నియంత్రణకు నిర్విరామంగా కృషి చేస్తున్న సిబ్బందికి ప్రతినెలా 10 శాతం ఇన్సెంటివ్ ఇవ్వాలని వారు పట్టుబడుతున్నారు.
ఇటీవల గాంధీ ఆస్పత్రిని సందర్శించిన కెసియార్ కూడా జూనియర్ డాక్టర్ల సమస్యలను పరిష్కరిస్తామని, సమ్మె బాట పట్టవద్దని కోరారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోడంతో సమ్మె కొనసాగించదానికే జుడాలు మొగ్గు చూపారు.