Saturday, January 18, 2025
Homeసినిమాఅదే నాకు మీరిచ్చే కానుక : జూనియర్

అదే నాకు మీరిచ్చే కానుక : జూనియర్

లాక్ డౌన్ నియమాలు పాటిస్తూ అందరు ఇంట్లోనే ఉండాలని అభిమానులకు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పిలుపు ఇచ్చారు. అదే నాకు మీరిచ్చే పుట్టిన రోజు కానుక అంటూ విన్నపం చేశారు. రేపు మే 20న జూనియర్ జన్మదినం. కోవిడ్ బారిన పడి ప్రస్తుతం హోం క్వారెంటైన్ గడుపుతున్న యంగ్ టైగర్ ఎలాంటి ఆర్భాటాలు చేయవద్దని కోరారు.

ప్రతి ఏటా మీరు చేసే సేవా కార్యక్రమాలు ఆశీర్వాదంగా భావిస్తానని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గడుపుతూ ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. కరోనాపై యుద్ధం చేసున్న ఫ్రంట్ లైన్ వర్కర్లకు సంఘీభావం తెలపాలని అభిమానులకు సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్