Sunday, January 19, 2025
Homeసినిమాకేజీఎఫ్ డైరెక్ట‌ర్ కి పార్టీ ఇచ్చిన ఎన్టీఆర్

కేజీఎఫ్ డైరెక్ట‌ర్ కి పార్టీ ఇచ్చిన ఎన్టీఆర్

Its Party Time: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సంచ‌ల‌న చిత్రం కేజీఎఫ్. ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం కేజీఎఫ్ 2. ఈ సినిమా ఒక్క క‌న్న‌డ‌లోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. విడుద‌లైన అన్ని ఏరియాల్లో రికార్డు క‌లెక్ష‌న్స్ తో దూసుకెళుతోంది. బాలీవుడ్ లో దంగ‌ల్ రికార్డ్ ను క్రాస్ చేసి బాహుబ‌లి 2 త‌ర్వాత‌ సెకండ్ ప్లేస్ లో నిలిచింది కేజీఎఫ్ 2.
కేజీఎఫ్ 2 ఇంత‌టి సంచ‌ల‌నం సృష్టించ‌డంతో ప్ర‌శాంత్ నీల్ తో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ హీరోలు, సౌత్ హీరోలు, బ‌డా ప్రొడ్యూస‌ర్స్ ఆస‌క్తి చూపిస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రశాంత్ నీల్… పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో సినిమా చేయ‌నున్నారు. ఈ సినిమాను ఆల్రెడీ ప్ర‌క‌టించ‌డం జ‌రిగింది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించ‌నుంది.

అయితే.. తాజాగా ఎన్టీఆర్, కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి పార్టీ ఇచ్చాడు. మే 5వ తారీకు ఎన్టీఆర్ పెళ్లి రోజు కావడంతో ప్రశాంత్ నీల్ దంప‌తులకు ఎన్టీఆర్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ అభిమానులు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ త్వరగా సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లండి అని కామెంట్లు పెడుతున్నారు. ఎన్టీఆర్ జూన్ నుంచి కొర‌టాల శివ‌తో సినిమా చేయ‌నున్నారు. ఆత‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ తో సినిమా చేయ‌నున్నార‌ని స‌మాచారం.

Also Read : ఎన్టీఆర్ గురించి ప్ర‌శాంత్ నీల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్