Saturday, January 18, 2025
Homeసినిమాఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేష‌న్లో భారీ పాన్ ఇండియా మూవీ

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేష‌న్లో భారీ పాన్ ఇండియా మూవీ

NTR-Trivikram: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మాట‌ల మాంత్రికుడు శ్రీనివాస్… వీరిద్దరి కాంబినేష‌న్లో ‘అర‌వింద స‌మేత‌.. వీర రాఘ‌వ’ అనే సినిమా రూపొందింది. ఈ భారీ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గర విజ‌యం సాధించింది. మ‌ళ్లీ వీరిద్దరూ క‌లిసి సినిమా చేయాలి అనుకున్నారు. అనుకోవ‌డ‌మే కాదు.. అఫీషియ‌ల్ గా సినిమాని అనౌన్స్ చేయ‌డం కూడా జ‌రిగింది. ఈ క్రేజీ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌ నిర్మించాలి అనుకుంది. అయితే… ఆ త‌ర్వాత ఏమైందో ఏమో కానీ… ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోయింది.

ఆత‌ర్వాత ఎన్టీఆర్.. కొరటాల శివతో సినిమాని ప్రక‌టించ‌డం.. త్రివిక్రమ్ శ్రీనివాస్.. మహేష్ బాబుతో తన హ్యటిక్ మూవీని అనౌన్స్ చేయడం జరిగింది. అయితే… ఇంత వరకు ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ క్యాన్సిల్ అవడానికి కారణాలు ఏంటి అనేవి మాత్రం బయటకు రాలేదు కానీ… క్రియేటీవ్ డిఫ‌రెన్స్ వ‌ల‌నే ఈ కాంబినేష‌న్లో మూవీ సెట్ అవ్వలేద‌ని టాక్ వినిపించింది. ఇదిలా ఉంటే… నిర్మాత సూర్యదేవ‌ర నాగ‌వంశీ డిజీ టిల్లు మూవీ ప్రమోష‌న్స్ లో భాగంగా ఇచ్చిన ఇంట‌ర్ వ్యూలో ఈ క్రేజీ మూవీ పై క్లారిటీ ఇచ్చారు.
ఇంత‌కీ నిర్మాత సూర్యదేవ‌ర నాగ‌వంశీ ఏం చెప్పారంటే.. తార‌క్, త్రివిక్రమ్ కాంబినేష‌న్లో మూవీ క్యాన్సిల్ అవ్వలేదు. వాయిదా వేసుకున్నాం అంతే. తార‌క్ అన్నతో చాలా పెద్ద పాన్ ఇండియా మూవీ చేయ‌నున్నాం. త్రివిక్రమ్ గారు అనుకున్న సబ్జెక్ట్ అలాంటిది. త్వర‌లో పూర్తి వివ‌రాలు చెబుతాం అన్నారు.

Also Read : మ‌హేష్ బాబు, త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ మూవీ ప్రారంభం

RELATED ARTICLES

Most Popular

న్యూస్