Saturday, January 18, 2025
HomeUncategorizedకోలుకున్న జూనియర్ ఎన్టీఆర్

కోలుకున్న జూనియర్ ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు గత కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్ రావడం తెలిసిందే. ఇప్పటి వరకు హోమ్ ఐసోలేషన్ లో ఉండి డాక్టర్ల సూచనల మేరకు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే.. ఎన్టీఆర్ కు కరోనా అని తెలిసినప్పటి నుంచి అభిమానులు, స్నేహితులు త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని కోరుకున్నారు. ఎన్టీఆర్ తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పినా.. అభిమానులు కలత చెందారు. ఆఖరికి ఈ రోజు టెస్ట్ చేయిస్తే.. కరోనా నెగిటివ్ వచ్చిందని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు ఎన్టీఆర్.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ స్పందిస్తూ.. తను కరోనా నుంచి బయటపడాలని.. ఆరోగ్యం బాగుపడాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియచేశారు. అలాగే తన హెల్త్ గురించి ప్రత్యేక శ్రద్థ తీసుకున్న డాక్టర్స్ కి కూడా థ్యాంక్స్ తెలియచేశారు. అలాగే కరోనాను చాలా సీరియస్ గా తీసుకోవాలని.. అదే టైమ్ లో చాలా పాజిటివ్ గా ఉండాలన్నారు. మన మనోధైర్యమే ఆయుథం.. అందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. సినిమాల విషయానికి వస్తే.. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత కొరటాల శివతో పాన్ ఇండియా మూవీ చేయనున్నారు. ఈ సినిమా తర్వాత కేజీఎఫ్‌, సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమా చేయనున్నట్టు ప్రకటించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్