Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

అవినీతి ఆరోపణల కేసులో మ‌యన్మార్ హక్కుల కార్యకర్త, నోబెల్ పురస్కార గ్రహీత అంగ్ సాన్ సూకీకి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. 6 లక్షల డాలర్ల నగదు, బంగారాన్ని లంచం రూపంలో తీసుకున్నట్టు జుంటా కోర్టు స్పష్టం చేసింది. అంగ్ సాన్ సూకీపై అక్కడి సైనిక ప్రభుత్వం మొత్తం 11 అవినీతి కేసులను మోపింది. వీటిలో అభియోగాలు నిరూపితం అయితే ఒక్కో దానిలో గరిష్ఠంగా 15 ఏళ్ల వరకు జైలు శిక్ష పడొచ్చు. ఈ 11 కేసుల్లో విచారణ పూర్తయిన మొదటి అవినీతి కేసు ఇది. నాలుగు గోడల మధ్యే కేసు విచారణ పూర్తి చేశారు. ఇంతకుమించి వివరాలు బయటకు రాకుండా అక్కడి సైనిక సర్కారు జాగ్రత్తలు తీసుకుంది.
నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్డీ) పార్టీ చైర్ పర్సన్ గా ఉన్న అంగ్ సాన్ సూకీ ప్రజానేత. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం కోసం ఆమె మొదటి నుంచి పోరాడుతూనే ఉన్నారు. ఇది అక్కడి పాలకులకు నచ్చదు. దీంతో ఆమెను మొదటి నుంచి సైనిక పాలకులు తొక్కిపెడుతూ వచ్చారు. 1990 ఎన్నికల్లో ఆమె పార్టీకి 81 శాతం పార్లమెంటు సీట్లు వచ్చాయి. అయినా ఆమెకు అధికారాన్ని బదలాయించేందుకు సైనిక పాలకులు నిరాకరించారు. ఎన్నికల ముందు నుంచే ఆమెను నిర్బంధించగా.. 1989 నుంచి 2010 మధ్య 15 ఏళ్లపాటు హౌస్ అరెస్ట్ లోనే ఉండిపోయారు.

సుకి పార్టి 2020 లో జరిగిన ఎన్నికల్లో అధికారమలోకి రాగా జుంట నేతృత్వంలో మిలిటరీ కుట్ర చేసి ఫిబ్రవరి 2021 లో అంగ్ సాన్ సుకి కి అధికారం దక్కకుండా చేసి… అవినీతి ఆరోపణలు మోపి జైలుకు పంపారు. జుంట అరాచకాలపై ఐక్యరాజ్య సమితి సహా యూరోప్, అమెరికా తదితర దేశాలు విమర్శలు చేసినా పట్టించుకోలేదు. జుంట అరాచకాలతో మయన్మార్ లో ప్రజాస్వామ్యం మనుగడలో లేకుండా పోయింది. మయన్మార్ మిలిటరీ ప్రభుత్వానికి మొదటి నుంచి చైనా సహాయ సహకారాలు అందిస్తోంది. దీంతో ప్రజాస్వామ్యం కోసం ప్రజలు ఆందోళనలు చేయటం.. ఆంగ్ సాన్ సుకి ని జైలు నుంచి విడుదల చేయాలని నిరసనలు తెలపటం…  మిలిటరీ పాలకులు ఉక్కుపాదం మోపటం గత రెండేళ్ళ నుంచి సాధారణమైంది.

Also Read : నాటో కూటమిలో చేరనున్న స్వీడన్, ఫిన్లాండ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com