Sunday, January 19, 2025
HomeTrending Newsఏపీ జీవోపై తెలంగాణలో భేటీలా: వైసీపీ

ఏపీ జీవోపై తెలంగాణలో భేటీలా: వైసీపీ

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీపై వైసీపీ నేతలు స్పందించారు.

సంక్రాంతి పండుగ మామూళ్ళ కోసం దత్తతండ్రి చంద్రబాబు వద్దకు దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ వెళ్ళారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ట్వీట్ చేశారు.

“సంక్రాంతికి అందరింటికి గంగిరెద్దులు వెళ్తాయి చంద్రబాబు ఇంటికి పవన్  కళ్యాణ్ వెళ్ళాడు డుడు బసవన్నలా తల ఊపడానికి!”అంటూ జలవనరుల శాఖ మంత్రి అంబటి ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.

పవన్ టిడిపికి దత్తపుత్రుడు అని తాము మొదటినుంచీ చెబుతూనే ఉన్నామని, అయన చంద్రబాబుకు సహాయం చేయడానికి పనిచేస్తున్నాడని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. వారిద్దరి ముసుగు తొలగిపోయిందని, ప్యాకేజీ కోసమే ఈ భేటీ జరుగుతోందని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై తెలంగాణలో కూర్చుని మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. బలమైన శక్తిగా మారిన సిఎం జగన్ ను ఎదుర్కొనేందుకు ఇద్దరూ కలిసి రావాలని సన్నాహాలు చేసుకుంటున్నారని అన్నారు.  పవన్ కు ప్రత్యేకంగా ఓ అజెండా అంటూ ఏమీ లేదని, ప్రభుత్వాన్ని అస్థిర పరచేందుకే ఈ కలయిక జరిగిందన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్