గుజరాత్ లో జరుగుతోన్న 36వ జాతీయ క్రీడల్లో తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు సత్తా చాటారు. నిన్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన యార్రాజి జ్యోతి 100 మీటర్ల విభాగంలో స్వర్ణం సాధించగా, తెలంగాణా షూటర్ ఇషా సింగ్ 25 మీటర్ల ఈవెంట్ లో విజేతగా నిలిచింది.
ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు దండి జ్యోతికశ్రీ 400 మీటర్ల పరుగు పందెంలో రెండో స్థానంలో నిలిచి రజత పతకం దక్కించుకుంది. వెయిట్లిఫ్టింగ్ 67 కేజీల విభాగంలో కే.నీలంరాజు రజత పతకం సాధించాడు. భావనగర్ లోని ఎస్.సి.బి . అవుట్ డోర్ స్టేడియం లో జరిగిన బాస్కెట్ బాల్ పోటీలో ఆంధ్ర ప్రదేశ్ జట్టు 20 -18 పాయింట్ల తేడాతో కేరళను ఓడించింది.
తెలంగాణకు చెందిన కాంతిశ్రీ- జూహిత్ లు రోలర్ స్కేటింగ్ కపుల్ డాన్స్ ఈవెంట్ లో కాంస్యం పతకం దక్కించుకున్నారు,