Sunday, January 19, 2025
HomeTrending Newsసిఎంను కలిసిన కనకదాసు పీఠాధిపతి

సిఎంను కలిసిన కనకదాసు పీఠాధిపతి

కర్ణాటక కాగినెలె కనకదాసు గురుపీఠ పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ నిరంజనానందపురి మహాస్వామి, కర్ణాటక పురపాలక శాఖ మంత్రి ఎం.టి.బి.నాగరాజు, మాజీ మంత్రి హెచ్‌.ఎం.రేవణ్ణ, కర్ణాటక వెనుకబడిన కులాల ఫెడరేషన్‌ ప్రెసిడెంట్‌ బి.కే.రవిలు నేడు తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. తిరుమలలో కనకదాసు గురుపీఠం మఠం నిర్మించేందుకు అవసరమైన ఒక ఎకరా భూమిని కేటాయించాలని సిఎంకు విజ్ఞప్తి చేశారు. దీనిపై సిఎం జగన్ సానుకూలంగా స్పందించారు.

తిరుమల క్ష్రేత్రంలో తమ కురబ సామాజిక వర్గానికి ఇప్పటి వరకు మఠం లేదని, లక్షలాదిమంది స్వామి వారి భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారని పీఠాధిపతి సిఎంకు వివరించారు. అంతేకాక శ్రీ వేంకటేశ్వరస్వామి వారి కీర్తనలు, ప్రసస్ధ్యానికి తమ పీఠానికి ఉన్న చరిత్రను ముఖ్యమంత్రితో  మహాస్వామి పంచుకున్నారు.

ఈ సమావేశంలో పాల్గొన్న మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషా శ్రీ చరణ్, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్