Sunday, January 19, 2025
HomeTrending Newsబాబు ట్రాప్ లో పడొద్దు: కాకాణి సలహా

బాబు ట్రాప్ లో పడొద్దు: కాకాణి సలహా

ప్రతిపక్షనేత చంద్రబాబు నిరుద్యోగులను, యువతను రెచ్చగొడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. బాబు ట్రాప్ లో పడొద్దని యువతకు సలహా ఇచ్చారు. 14 ఏళ్ళ పాలనలో చంద్రబాబు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తానని మోసం చేసిన టీడీపీకి ఇప్పుడు నిరసన చేసే హక్కు ఎక్కడిదని అయన నిలదీశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అయన మీడియాతో మాట్లాడారు.

  • దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో సచివాలయ వ్యవస్థ ద్వారా ఒకేసారి 1.21 లక్షల ఉద్యోగాలు కల్పించాం
  • 51 వేలకు పైగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశాం, వారి రిటైర్మెంట్ వయసు 60 ఏళ్ళకు పెంచాం
  • కేవలం రెండేళ్ళలోనే 1.84 లక్షల పర్మినెంటు, ఇతర ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలతో కలిపి మొత్తం 6 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించాం
  • చదువు, సంధ్య, సంస్కారం లేని పనికిరాని లోకేష్ వర్చువల్స్ మీటింగులు పెట్టి నిరుద్యోగులను రెచ్చగొడుతున్నాడు
  • ప్రభుత్వ ఉద్యోగాలకు కాలం చెల్లింది, ఉద్యోగ భద్రత ఉంటే సోమరిపోతులుగా మారుతున్నారని “మనసులో మాట”ఉద్యోగులను అవమానించింది బాబు కాదా?
  • చంద్రబాబు నాయుడు అండ్‌ కో జాబ్‌ క్యాలెండర్‌పై అసత్య ప్రచారాలు చేస్తున్నారు
  • సంక్షేమ కార్యక్రమాల అమలు ద్వారా సమాజంలోని అన్నివర్గాల బాగోగులను చూస్తోన్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు, ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ యువతను కూడా ఆదుకుంటాఋ
  • యంగ్ అండ్ డైనమిక్ ముఖ్యమంత్రి అయిన జగన్ మోహన్ రెడ్డిగారు నిరుద్యోగ యువతకు కచ్చితంగా న్యాయం చేస్తారు.
  • ఇతర రాజకీయ పార్టీలు గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీల గురించి ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు.
  • రానున్న రోజుల్లో నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు కల్పించడడానికి వీలు ఉందో అన్నింటినీ భర్తీ చేయడానికి  ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
RELATED ARTICLES

Most Popular

న్యూస్