Kalaavathi Records: సూపర్‌స్టార్ మహేష్ బాబు మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ ‘సర్కారు వారి పాట’. ఈ భారీ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ మే 12 ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. తమన్ స్వరపరిచిన ఫస్ట్ సింగిల్ ‘కళావతి’ నిన్న విడుదలై ట్రెమండస్ రెస్పాన్స్ దక్కించుకుంది.
మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సింగర్ సిద్ శ్రీరామ్, లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ సమిష్టి కృషితో ఈ పాట రికార్డు వ్యూస్ సాధించి మెలొడి సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. కళావతి పాట 24 గంటల్లో 16 మిలియన్ల వ్యూస్ సాధించి సౌత్ ఇండియాలోనే ఎక్కువ మంది చూసిన పాటగా రికార్డు క్రియేట్ చేసింది. ఇక 24 గంటల్లో ఈ పాటకు 806K లైక్స్ రావడం విశేషం. సర్కారు వారి పాట సమ్మర్ స్పెషల్ గా మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.