కాళోజీ నారాయణరావు విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్లులో గణపతి ఉత్సవాలు నిర్వహించాడని, ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శమని మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు తెలిపారు. తెలంగాణలో అక్షరజ్యోతిని వ్యాపింపజేయాలన్న తపనతో ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించిన ప్రముఖుల్లో కాళోజీ ఒకడని మంత్రి తెలిపారు. రజాకార్ల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ 1945లో పరిషత్తు ద్వితీయ మహాసభలను దిగ్విజయంగా నిర్వహించడంలో కాళోజీ ప్రదర్శించిన చొరవ, ధైర్యసాహసాలను అతని అభిమానులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటుంటారని మంత్రి కొనియాడారు. కాళోజీ జయంతి సందర్భంగా వరంగల్ – హన్మకొండ లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్, వరంగల్ మహా నగర మేయర్ గుండు సుధారాణి, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ బండా ప్రకాష్, ఎమ్మెల్యే ఒడితెల సతీష్ బాబు, డీసీసీబీ చైర్మన్ మార్నెని రవీందర్ రావు, కుడా చైర్మన్ సుందర్ రాజ్, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు బి.గోపి, రాజీవ్‌గాంధీ హన్మంతు, కాళోజీ శిష్యులు, ఉద్యోగ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కాళోజీ నారాయణరావు, కాళోజీ గా, కాళన్న”గా సుపరిచితులన్నారు. కాళోజీ 1914, సెప్టెంబరు 9 న కర్ణాటక రాష్ట్రం, బీజాపూర్ జిల్లా లోని రట్టిహళ్లి గ్రామంలో జన్మించాడని, బీజాపూర్ నుంచి వరంగల్ జిల్లాకు తరలివచ్చిన కాళోజీ కుటుంబం మడికొండలో స్థిరపడిందన్నారు. కాళోజీ ప్రాథమిక విద్యానంతరం హైదరాబాదు పాతబస్తీలోని చౌమహల్ న్యాయపాఠశాలలో కొంతకాలం చదివిండు. అటు తరువాత సిటీ కాలేజీ లోనూ, హన్మకొండ లోని కాలేజియేట్ ఉన్నత పాఠశాల లోనూ చదువు కొనసాగించి మెట్రిక్యులేషన్ పూర్తిచేశాడు. 1939లో హైదరాబాదులో హైకోర్టుకు అనుబంధంగా ఉన్న న్యాయ కళాశాలనుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందాడు. 1930 నుంచే కాళోజీ గ్రంథాలయోద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్నాడు.
ప్రత్యేక తెలంగాణ కావాలి, రావాలి అని తన జీవితాన్ని తెలంగాణ కోసం త్యాగం చేసిన మహౌన్నత వ్యక్తి కాళోజీ నారాయణరావు అని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రజా కవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణ రావు 108వ జయంతి సందర్భంగా శుక్రవారం నిర్మల్ కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. మన ప్రాంత బిడ్డల త్యాగాలను మనందరం గుర్తు చేసుకొని వారి అడుగుజాడల్లో నడవాలనే ఉద్దేశంతో జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని తెలిపారు. సమాజంలో జరుగుతున్న, ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలపైన ఆయన కవితల ద్వారా చైతన్య వంతులను చేశారని, అయన స్పూర్తిని నేటి తరం ఆదర్శంగా తీసువాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఆలీ ఫారూఖీ, ఎస్పీ ప్రవీణ్ కుమార్, అదనపు కలెక్టర్ లు హేమంత్ బోర్కడే, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.
Also Read : కాళోజీ అవార్డుకు రామోజు హరగోపాల్ ఎంపిక