Saturday, January 18, 2025
Homeసినిమా‘బింబిసార’ ట్రైలర్ కు టెరిఫిక్ రెస్పాన్స్‌

‘బింబిసార’ ట్రైలర్ కు టెరిఫిక్ రెస్పాన్స్‌

Bimbisara:  కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన చిత్రాల్లోనటిస్తూ తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌. ఈ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘బింబిసార’. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ ప‌తాకంపై హ‌రికృష్ణ‌.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ ట్యాగ్ లైన్. వ‌శిష్ఠ్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ పుట్టిన రోజు (జూలై 5) సంద‌ర్భంగా  ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ మాట్లాడుతూ … రెండున్నరేళ్ల తర్వాత అందరినీ కలుస్తున్నాను. ఎన్నో చంద‌మామ క‌థ‌లు విన్నాం. చ‌దివాం.. కొన్ని చూశాం. కొన్ని తాత‌య్య‌, నాన్న‌మ్మ‌, అమ్మ‌మ్మ‌లు కొన్ని క‌థ‌ల‌ను చెబితే, కొన్నింటిని మ‌నం పుస్త‌కాల్లో చ‌దివాం. కొన్నింటిని మ‌నం వెండితెర పై చూసుంటాం. తాత గారు చేసిన పాతాళ భైర‌వి, గులేబ‌కావళి క‌థ‌, జ‌గ‌దేవీరుని క‌థ‌, బాబాయ్ చేసిన భైర‌వ ద్వీపం, త‌ర్వాత వ‌చ్చిన ఆదిత్య 369.. త‌ర్వాత చిరంజీవి గారు చేసిన జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి, మా జ‌న‌రేష‌న్‌లో త‌మ్ముడు చేసిన య‌మ‌దొంగ‌, రామ్ చ‌ర‌ణ్ చేసిన మ‌గ‌ధీర‌, రీసెంట్‌గా వ‌చ్చిన ప్ర‌భాస్ బాహుబ‌లి సినిమాలు గ‌మ‌నిస్తే.. అన్ని అంద‌మైన సోషియో ఫాంట‌సీ ఎలిమెంట్స్ ఉన్న సినిమాల‌ను ప్రేక్ష‌కులు ఆద‌రించారు.

అలాంటి అంద‌మైన గొప్ప చంద‌మామ క‌థ‌ను ఆగ‌స్ట్ 5న మీ ముందుకు తీసుకొస్తున్నాం. అదే బింబిసార‌. ఆ సినిమాల‌ను ఆద‌రించిన‌ట్లే ఈ సినిమాను ఆద‌రిస్తార‌ని మ‌న‌స్ఫూర్తిగా ఆశిస్తున్నాను. టీజ‌ర్‌, ట్రైల‌ర్ మీకు న‌చ్చే ఉంటాయ‌ని అనుకుంటున్నాను. మా సినిమా కోసం ప‌ని చేసిన తోటి న‌టీన‌టుల‌కు చాలా థాంక్స్‌. అంద‌రూ ఈ సినిమా కోసం ఎంత క‌ష్ట‌ప‌డ్డారో మ‌ళ్లీ మ‌రోసారి మాట్లాడుతాను. ఈ ఏడాది మా తాత గారు స్వ‌ర్గీయ ఎన్టీఆర్‌గారి వంద‌వ పుట్టిన రోజు సంవ‌త్స‌రంగా వ‌న్ అండ్ ఓన్లీ లెజెండ్ అయిన ఆయ‌కు మా బింబిసార సినిమాను డేడికేట్ చేస్తున్నాను’’ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్