Saturday, January 18, 2025
Homeసినిమాకళ్యాణ్ రామ్ సినిమా టైటిల్ గా 'మెరుపు'

కళ్యాణ్ రామ్ సినిమా టైటిల్ గా ‘మెరుపు’

కల్యాణ్ రామ్ కి ‘ బింబిసార’ తరువాత హిట్ పడలేదు. మరో విభిన్నమైన కంటెంట్ తో ప్రేక్షకులను అలరించడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఆయన తాజా చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో ఆయన నుంచి ‘రాజా చెయ్యి వేస్తే’ అనే సినిమా వచ్చింది. కానీ అంతగా ఆడలేదు. ఈ నేపథ్యంలో ఆయనకి కల్యాణ్ రామ్ ఈ సినిమాతో ఛాన్స్ ఇచ్చాడు. ప్రస్తుతం షూటింగు దశలో ఉంది. డిఫరెంట్ కంటెంట్ తో ఈ సినిమా రూపొందుతోంది.

ఈ సినిమాకి ఇంతవరకూ టైటిల్ సెట్ చేయలేదు. ‘మెరుపు’ అనే టైటిల్ ను ఖాయం చేసే అవకాశం ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది. కొన్ని టైటిల్స్ ను పరిశీలించిన తరువాత, ఇది కథకు తగినదిగా ఉందనే ఉద్దేశంతో ఫైనల్ చేయనున్నారని అంటున్నారు. గతంలో ఈ టైటిల్ ను చరణ్ సినిమా కోసం అనుకున్నారుగానీ, ఎందుకనో వర్కౌట్ కాలేదు. ఇప్పుడు కల్యాణ్ రామ్ ఈ టైటిల్ పట్ల ఆసక్తిని చూపుతున్నాడని చెబుతున్నారు.

ఈ సినిమాలో విజయశాంతి పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుంది. విజయశాంతి అంటేనే పవర్ఫుల్ పోలీస్ పాత్రలకు కేరాఫ్ అడ్రెస్. ‘కర్తవ్యం’ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా ఆమె పోషించిన వైజయంతి పాత్రను ఆడియన్స్ ఇంకా మరిచిపోలేదు. అదే పేరుతో ఆమె ఈ సినిమాలో కనిపించనుండటం విశేషం. 22 ఏళ్ల తరువాత ఆమె మళ్లీ పోలీస్ ఆఫీసర్ పాత్రను ధరించడం, ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్