Saturday, January 18, 2025
Homeసినిమాక‌ళ్యాణ్ రామ్ మూవీలో భారీ మార్పులు చేర్పులు

క‌ళ్యాణ్ రామ్ మూవీలో భారీ మార్పులు చేర్పులు

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఇటీవ‌ల ‘బింబిసార‘ తో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేశారు. కొత్త ద‌ర్శ‌కుడు వ‌శిస్ట్ పై న‌మ్మ‌కంతో క‌ళ్యాణ్ రామ్ భారీ బ‌డ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. క‌ళ్యాణ్ రామ్ న‌మ్మ‌కం నిజ‌మైంది.  దీంతో క‌ళ్యాణ్ రామ్ నెక్ట్స్ మూవీ పై మ‌రింత ఆస‌క్తి ఏర్ప‌డింది. అయితే.. బింబిసార సినిమాతో పాటే సైలంట్ గా మరో సినిమా కూడా రెడీ అయిపోయింది. అది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.

దసరా సీజన్ లో ఈ మూవీని విడుదల చేయాలనుకున్నారు కానీ.. ఇప్పుడు అది వాయిదాప‌డింది. కారణం ఏంటంటే… బింబిసార సక్సెస్ నేపథ్యంలో మరిన్ని మెరుగులు దిద్దాలనుకుంటున్నార‌ట మేక‌ర్స్. ఇలా చేయాలంటే టైమ్ సరిపోదు కనుక డిసెంబర్ కు వాయిదా వేశారని టాక్. ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఒక కొలిక్కి వచ్చాక కొన్ని సన్నివేశాలు రీషూట్ చే స్తారని తెలిసింది.  దీని త‌ర్వాత దిల్ రాజు బ్యాన‌ర్ లో కళ్యాణ్ రామ్ సినిమా ఉంటుంది.  అది ఎప్పుడు..?  ఎవ‌రితో..? అనేది క్లారిటీ లేదు. ఇవన్నీ పూర్తయ్యాకనే బింబిసార 2 ప్రాజెక్టు మొదలవుతుందని తెలిసింది.

Also Read : ‘బింబిసార-2’ లో బాల‌య్య?

RELATED ARTICLES

Most Popular

న్యూస్