Thursday, November 28, 2024
Homeసినిమాహీరో అతనే .. విలనూ అతనే!

హీరో అతనే .. విలనూ అతనే!

కల్యాణ్ రామ్ హీరోగా రూపొందిన ‘అమిగోస్’ ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబవుతోంది. ఈ సినిమాతో దర్శకుడిగా రాజేంద్ర రెడ్డి పరిచయమవుతున్నాడు. అలాగే ఈ సినిమాకి హీరోయిన్ గా చేసిన ఆషిక రంగనాథ్ కి కూడా ఇదే ఫస్టు సినిమా. ఈ సినిమాలో తాను మూడు విభిన్నమైన పాత్రలను చేశాననీ, అయితే వాళ్లు ఒకే ఫ్యామిలీయకి చెందినవారు కాదనీ,  ‘అమిగోస్’ అంటే  ఫ్రెండ్స్ అని ప్రతి ప్రమోషన్ లోను కల్యాణ్ రామ్ చెబుతూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ వచ్చాడు.

తెలుగు తెరపై చాలామంది హీరోలు ద్విపాత్రాభినయం చేశారు. అన్నదమ్ములుగా .. తండ్రీ కొడుకులుగా తెరపై సందడి చేశారు. ఇద్దరు ఎన్ని గొడవలు పడినా చివరికి వచ్చేసరికి, ఇద్దరూ కలిసి విలన్ తో తలపడేవారు. హీరోగా .. విలన్ గా ఒకే హీరో ద్విపాత్రాభినయం చేసినా, మూడు పాత్రలను చేసిన వాళ్లు ఒకే ఫ్యామిలీకి చెందినవారు గనుక, విలనిజం ఆడియన్స్ పై అంతగా ప్రభావం చూపించదు. కానీ ఇక్కడ ‘అమిగోస్’ పరిస్థితి వేరు.

ఈ సినిమాలో ముగ్గురు హీరోలు మూడు రాష్ట్రాలకి చెందినవారు. వాళ్ల భాష వేరు .. భావాలు వేరు. ఒక మాదిరిగానే ఉన్నామనే థ్రిల్ తప్ప వాళ్ల మధ్య ఎలాంటి ఎమోషనల్ బాండింగ్ లేదు. ఆ ముగ్గురిలో సైకలాజికల్ గా ఒకరు తేడా అయితే? అతను విలన్ గా మారితే? ఎలా ఉంటుందనేదే కీలకమైన అంశం. అంటే .. ఈ సినిమాలో హీరో .. విలన్ .. ఇద్దరూ కల్యాణ్ రామ్ నే. హీరో .. విలన్ తలపడుతూ ఉంటారు. మరి ఆ సమయంలో మూడో పాత్ర ఏం చేస్తూ ఉంటుంది? అనేదే కథ. పాయింట్ లో అయితే కొత్తదనం ఉంది. మరి తెరపై అది ఎంతవరకూ ఆసక్తిని పెంచుతుందనేది చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్