Sunday, January 19, 2025
Homeసినిమాఆ మూడు సినిమాల్లో ఒకటి రీమేక్ చేస్తా - కళ్యాణ్‌ రామ్

ఆ మూడు సినిమాల్లో ఒకటి రీమేక్ చేస్తా – కళ్యాణ్‌ రామ్

కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఈ చిత్రానికి వశిష్ట్ దర్శకత్వం వహించారు. సక్సెస్ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చారు. ఇప్పుడు ‘అమిగోస్’ అనే డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాకి కూడా రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఫిబ్రవరి 10న అమిగోస్ మూవీ విడుదల కానుంది. ఈ సినిమా సక్సెస్ పై టీమ్ అంతా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అయితే.. బింబిసార మూవీలో ద్విపాత్రాభినయం చేస్తే.. అమిగోస్ లో త్రిపాత్రాభినయం చేయడం విశేషం.

కళ్యాణ్‌ రామ్ ఓ వైపు హీరోగా నటిస్తూనే.. మరో వైపు నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై అతనొక్కడే, ఓం త్రిడీ, పటాస్ ఇలా ఎన్నో సినిమాలు నిర్మించారు. తమ్ముడు తారక్ తో కళ్యాణ్‌ రామ్ జై లవకుశ అనే సినిమా నిర్మించారు. పెద్ద విజయం సాధించారు. ఇప్పుడు తారక్ తో కొరటాల శివ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఈ నెలలో పూజా కార్యక్రమాలు ప్రారంభించి మార్చి నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇలా హీరోగా, ప్రొడ్యూసర్ గా రాణిస్తున్న కళ్యాణ్ రామ్ ఓ ఇంటర్ వ్యూలో తన మనసులో మాటలను బయటపెట్టారు.

ఇంతకీ విషయం ఏంటంటే.. తాత గారు చేసిన సినిమాల్లో నచ్చినవేమిటో చెప్పాలంటే పెద్ద జాబితానే ఉంటుంది అన్నారు. ఆయన సినిమాల్లో రీమేక్ చేయవలసి వస్తే, ఏయే సినిమాలను ఎంచుకుంటాను అంటే మాత్రం ఒక మూడు సినిమాలు మాత్రం గుర్తొస్తాయని.. ‘గుండమ్మ కథ’, ‘మిస్సమ్మ’, ‘కన్యాశుల్కం’ చెప్పారు. ఈ మూడు సినిమాలు అంటే చాలా ఇష్టమన్నారు. ఈ కథలకు ఇప్పటికీ మంచి ఆదరణ ఉంటుంది. అందువలన ఈ మూడు సినిమాల్లో ఏదైనా ఒక సినిమాను రీమేక్ చేయాలనుంది అంటూ కళ్యాణ్ రామ్ తన మనసులో ఉన్నది బయటపెట్టారు. మరి.. కళ్యాణ్‌ రామ్ కల ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.

Also Read : కళ్యాణ్ రామ్ డైరెక్టర్ తో బాలయ్య మూవీ

RELATED ARTICLES

Most Popular

న్యూస్