Friday, October 18, 2024
Homeసినిమానంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ‘బింబిసార’రిలీజ్ డేట్ ఫిక్స్

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ‘బింబిసార’రిలీజ్ డేట్ ఫిక్స్

Bibisara soon:  కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన చిత్రాల్లోనటిస్తూ.. తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘బింబిసార’. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ ప‌తాకంపై హ‌రికృష్ణ‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ ట్యాగ్ లైన్. వ‌శిష్ఠ్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. క‌ళ్యాణ్ రామ్ కు ఇది 18వ చిత్రం. తెలుగు సంవత్సరాది ఉగాది సంద‌ర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది యూనిట్ . ఆగ‌స్ట్ 5న విడుద‌ల చేస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమా నుంచి విడుద‌లైన క‌ళ్యాణ్ రామ్ ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌, టీజ‌ర్ సినిమా పై అంచ‌నాల‌ను పెంచాయి.

‘బింబిసార‌లో విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, గ్రాఫిక్స్ కీల‌కంగా ఉండ‌బోతున్నాయి. భారీ సెట్స్‌ తో క‌ళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే బిగ్ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న హై టెక్నిక‌ల్ వేల్యూస్ మూవీ ఇది. ఆగ‌స్ట్ 5న సినిమాను విడుద‌ల చేస్తున్నాం’’ అని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. కళ్యాణ్ రామ్ సరసన కెథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఛోటా కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి చిరంత‌న్ భ‌ట్ మ్యూజిక్‌. ప్ర‌ముఖ సీనియ‌ర్‌ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి నేప‌థ్య సంగీతాన్ని అందిస్తున్నారు.

Also Read : నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ టీజర్ విడుదల

RELATED ARTICLES

Most Popular

న్యూస్