Monday, January 20, 2025
HomeTrending Newsతెలంగాణలో మానవీయ పాలన : మంత్రి నిరంజన్ రెడ్డి

తెలంగాణలో మానవీయ పాలన : మంత్రి నిరంజన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో మానవీయ పాలన కొనసాగుతున్నదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. వనపర్తిలో కల్యాణలక్షి, షాదీముబారక్ , ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు ఈ రోజు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కల్యాణ లక్ష్మి రాకతో తెలంగాణలో బాల్య వివాహాలు ఆగిపోయాయన్నారు. కేసీఆర్ పెట్టిన ప్రతి పథకం తాత్కాలిక ప్రయోజనాల కోసం కాదు. దీర్ఘకాలిక లక్ష్యాలు దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసినవేనన్నారు.

సంప్రదాయం పేరుతో ఎన్నో ఏండ్లుగా కొనసాగుతున్న బాల్య వివాహాలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలతో అడ్డుకట్ట వేసినట్లయిందన్నారు.
ఇతర రాష్ట్రాలు ఈ పథకాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి అల్పాహారం స్వీకరించారు. ఐకమత్యం పెంపొందించాలనే సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.

Also Read :  త్వరలో కోహెడ ఫ్రూట్ మార్కెట్ తుది లే అవుట్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్