Saturday, January 18, 2025
Homeసినిమాకల్యాణ్ రామ్ చేసిన మరో సాహసమే 'డెవిల్'

కల్యాణ్ రామ్ చేసిన మరో సాహసమే ‘డెవిల్’

కల్యాణ్ రామ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లు పూర్తయ్యాయి. తన కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆయన కొత్త కథలను చేయడానికీ .. కొత్త పాత్రలలో కనిపించడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ వచ్చాడు. అలా  ఆయన చేసిన సినిమాలలో ‘పటాస్’ .. ‘118’ .. ‘బింబిసార’ వంటి  ప్రయోగాలు సక్సెస్ అయ్యాయి. ‘బింబిసార’ సినిమా ఆయన కెరియర్ లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా నిలిచింది. భారీ విజయంగా కొత్త రికార్డులను సాధించింది.

ఆ తరువాత కల్యాణ్ రామ్ చేసిన ‘అమిగోస్’ కథ కూడా ఆసక్తిని కలిగించేదే. ఈ కథ ఐడియా బాగుంది. కానీ అనుకున్న స్థాయిలో తెరపై ఆవిష్కరించడం కుదరలేదు. కల్యాణ్ రామ్ మూడు పాత్రలను పోషించడం వలన, ఆ పాత్రల విషయంలో ఆడియన్స్ కి సరైన క్లారిటీ దొరకలేదు. అందువలన ఆడియన్స్ కాస్త అయోమయానికి లోనయ్యారు. ఇప్పుడు ఆయన ‘డెవిల్’ సినిమాతో ఈ నెల 29వ తేదీన థియేటర్లకు రావడానికి రెడీ అవుతున్నాడు.

కథ ప్రకారం ఈ సినిమాలో కూడా కల్యాణ్ రామ్ డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. అభిషేక్ నామా అందిస్తున్న ఈ సినిమాలో, సంయుక్త మీనన్ – మాళవిక నాయర్ కథానాయికలుగా కనిపించనున్నారు. ఇతర ముఖ్యమైన పాత్రలను అజయ్ .. సీత .. అమ్ము అభిరామి పోషించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలుస్తుందని అంటున్నారు. మరో ఈ సినిమా కల్యాణ్ రామ్ హిట్ చిత్రాల జాబితాలో చేరుతుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్