Sunday, April 6, 2025
Homeసినిమానా లైఫ్ ను మార్చేసింది కమల్ సినిమాలే: హరీశ్ శంకర్ 

నా లైఫ్ ను మార్చేసింది కమల్ సినిమాలే: హరీశ్ శంకర్ 

Inspiration: కమలహాసన్ కథానాయకుడిగా ‘విక్రమ్‘ సినిమా రూపొందింది. కమల్ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, జూన్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి .. ఫహాద్ ఫాజిల్ .. నరేన్ ముఖ్యమైన పాత్రలలో నటించగా, ఒక ప్రత్యేకమైన పాత్రలో సూర్య కనిపించనున్నారు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన అప్ డేట్స్ అందరిలో ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా కమల్ లుక్ .. ఆయన పాత్రను డిజైన్ చేసిన తీరు అందరిలో ఉత్కంఠను పెంచుతోంది.

ఈ సినిమాను తెలుగులో హీరో నితిన్ రిలీజ్ చేస్తున్నాడు. తెలుగు వెర్షన్ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ – శిల్పకళా వేదికలో నిర్వహించారు. వెంకటేశ్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుకలో దర్శకుడు హరీశ్ శంకర్ మాట్లాడుతూ .. “కమల్ హాసన్ గురించి చెప్పాలంటే ఎక్కడి నుంచి మొదలెట్టాలో అర్థం కావడం లేదు. ‘ఆకలి రాజ్యం’ గురించి చెప్పాలా? ‘సాగరసంగమం’ గురించి చెప్పాలా? ఒక ‘భారతీయుడు’ .. ఒక ‘స్వాతి ముత్యం’ గురించి చెప్పాలా? ఆయన గురించి చెప్పడానికి భాష సరిపోదు. ఇండియన్స్ అంతా కూడా మాకు కమల్ ఉన్నారు అని గర్వంగా చెప్పుకుంటారు.

Also Read : ప‌వ‌న్, తేజు మ‌ల్టీస్టార‌ర్ సెట్స్ పైకి వ‌చ్చేది ఎప్పుడు..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్